Shirdi Sai: ఇక్కడ అడుగు పెడితే కష్టాలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం..
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:36 AM
భారత దేశంలో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో ఒకటి షిర్డీ. కోట్లాది మంది భక్తులకు ఇది ఒక పవిత్ర నిలయం. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.
ఇంటర్నెట్ డెస్క్ : షిర్డీ సాయిబాబా ఆలయం (Shirdi Sai Baba Temple) కోట్లాది మంది భక్తుల(Devotees)కు ఒక పవిత్ర నిలయం అని చెబుతారు. భక్తుల దుఃఖాలను, కష్టాలను తీర్చే కలియుగ దైవంగా భావిస్తారు. బాబా భౌతికంగా లేకపోయినా.. ఆయన సమాధి నుంచి భక్తులను ఎల్లవేళలా కాపాడుతారని భక్తులు విశ్వసిస్తారు. సాయిబాబా ఆలయంలో ఏ మతాని(religion)కి చెందిన వారైనా ప్రవేశించవొచ్చు. బాబా తన జీవితకాలంలో మసీదులో నివసిస్తూ, హిందూ పద్దతు(Hindu method)లను అనుసరిస్తూ అన్ని మతాల సారాంశం ఒక్కటే అని చాటిచెప్పారు. అందుకే ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.

1858 లో షిర్డీకి వచ్చిన సాయి బాబా జీవించింది ద్వారకామాయి అనే పాత మసీదులో.. ఇక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం ధూని (అగ్ని) వెలిగిస్తారు. ఈ ధూని 100 ఏళ్లకు పైగా నిరంతరం వెలుగుతూనే ఉండటం ఒక అద్భుతం. బాబా భౌతికంగా సమాధి చెందిన చోటే ప్రస్తుతం ప్రధాన ఆలయం ఉంది. బాబా విగ్రహం ముందు కూర్చొంటే ఆయన మనల్ని చూస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఏ కష్టమొచ్చినా షిర్డీలో సాయిబాబా దర్శనం చేసుకుంటే తమ బాధలు తొలగిపోతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు.
ప్రతిరోజూ ఇక్కడికి లక్షల మంది భక్తులు వస్తుంటారు. షిర్డీలో ఉన్న ప్రసాదాలయం ఆసియాలోనే అతి పెద్ద సోలార్ కిచెన్‌లలో ఒకటిగా పేరుగాంచింది. వేలాది మంది భక్తులకు ఇక్కడ ఉచితంగా, ఎంతో శుచిగా భోజనం పెడతారు. ప్రతి గురువారం బాబా పల్లకి సేవ ఇక్కడ జరుగుతుంది. సాయిబాబా ఆలయం కేవలం ఒక ప్రార్ధనా స్థలం మాత్రమే కాదు, శాంతికి, మానవత్వానికి చిహ్నం.
ఇవి కూడా చదవండి:
Lord Hanuman: హనుమంతుడిని సంకట మోచనుడు అని ఎందుకు అంటారు?
పర్యాటకులను కట్టిపడేస్తున్న వంజంగి, లంబసింగి అందాలు..