Pushya Pournami: పుష్య పౌర్ణమి వేళ.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు.. ఎందుకంటే..
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:12 AM
పుష్య పౌర్ణమి జనవరి 3వ తేదీన వచ్చింది. ఈ రోజు కొన్ని తప్పులు చేస్తే.. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.
పౌర్ణమి సమయంలో అమ్మవారిని పూజిస్తే శీఘ్రమే ఫలితం వస్తుందంటారు. అందుకే పౌర్ణమి రోజు అమ్మవారిని ఆరాధిస్తారు. ప్రస్తుతం పుష్య మాసం నడుస్తుంది. జనవరి 3వ తేదీన పౌర్ణమి వచ్చింది. పుష్య పౌర్ణమి రోజు కొన్ని తప్పులు చేస్తే.. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. ఈ రోజు తప్పులు చేస్తే ప్రతికూల శక్తి పెరిగి.. ఆర్థిక నష్టానికి దారి తీస్తుందని అంటున్నారు.
శాస్త్రం ప్రకారం. పుష్య పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు. ఈ రోజ మహాలక్ష్మీ, విష్ణుమూర్తులను పూజిస్తే ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందంటారు. ఈ రోజు దాతృత్వం, పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదంటే..
బ్రహ్మ ముహూర్తంలో..
ఈ రోజు బ్రహ్మ ముహూర్తం వేళ నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీని వల్ల ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు, లక్ష్మీదేవిల అనుగ్రహం కలుగుతుంది.
వాదనలకు దిగకండి..
ఇంట్లో ఎవరితోనైనా ఘర్షణలు, తగాదాలకు దిగకండి. ఇలా చేయడం అశుభాన్ని సూచిస్తుంది. ఇంటిలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. కుటుంబంలోని విభేదాలు, కోపం ఆర్థిక ఇబ్బందులుకు దారి తీస్తుంది. ఆలోచనతో మాట్లాడండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. పొరపాటున కూడా కోపం తెచ్చుకోవద్దు. లేనిపక్షంలో ఏడాది పొడవునా ఇబ్బందులు పెరుగుతాయి.
సాత్విక ఆహారం..
ఈ రోజు సాత్విక ఆహారం తీసుకోండి. మాంసం, మద్యం,వెల్లుల్లితోపాటు ఉల్లిపాయ వంటి తామస ఆహారానికి దూరంగా ఉండాలి. ఇది కెరీర్‌కు అడ్డుంకులు సృష్టిస్తోంది. నగదు నష్టం, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అదీకాక తామస ఆహారం ప్రతికూల శక్తిని పెంచుతుంది. ధర్మాన్ని నాశనం చేస్తుంది.
నగదు లావాదేవీలు..
పౌర్ణమి వేళ.. రుణం తీసుకోవడం లేదా ఇవ్వడం అశుభాన్ని సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మహాలక్ష్మీ అనుగ్రహాన్ని కొల్పోతారు. ఈ రోజు దానం చేయండి. అంతేకానీ రుణ లావాదేవీలు చేయకండి. అలా చేసినట్లు అయితే.. ఆర్థిక స్థిరత్వాన్ని కొల్పోతారు. ఈ పుష్య పౌర్ణమి రోజు ఈ తప్పులను నివారించినట్లు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఏడాది పొడవునా సంతోషంగా ఉండవచ్చు.