Share News

పోలాల అమావాస్య.. చివరి శ్రావణ శుక్రవారం.. ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలంటే?

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:10 PM

2026 సెప్టెంబర్ 11న పోలాల అమావాస్యతో పాటు చివరి శ్రావణ శుక్రవారం కూడా రావడంతో ఈ రోజుకు ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పూజలు, దానధర్మాలు చేస్తే శుభఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య విశ్వాసం.

పోలాల అమావాస్య.. చివరి శ్రావణ శుక్రవారం.. ఏ రాశి వారు ఏ పరిహారం చేయాలంటే?
Polala Amavasya 2026 Remedies

ఇంటర్నెట్ డెస్క్: 2026 సెప్టెంబర్ 11న శ్రావణ మాసం ముగియనుండగా.. అదే రోజు పోలాల అమావాస్య, చివరి శ్రావణ శుక్రవారం కలిసి రావడం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు, దానధర్మాలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

పుట్టిన నక్షత్రం, రాశిని బట్టి కొన్ని ప్రత్యేక పూజలు, దానాలు చేయడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. మరి ఏ రాశి వారు ఎలాంటి పూజలు, దానాలు చేయాలని చెబుతున్నారో తెలుసుకుందాం..


మేష రాశి

మేష రాశి వారు సెప్టెంబర్ 11వ రోజున శివాలయాన్ని సందర్శించి పరమేశ్వరుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలని జ్యోతిష్య నమ్మకం. అలాగే పేదలకు గోధుమలు, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిదని చెబుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు శివలింగానికి పాలతో అభిషేకం చేసి, తెల్లని పూలతో పూజ చేయాలని సూచిస్తారు. మహాలక్ష్మిని ఆరాధించడం, పేదలకు పాలు, పటిక బెల్లం దానం చేయడం శుభప్రదమని నమ్మకం. ఆలయంలో తెల్లని వస్త్రాలు, దక్షిణ సమర్పించవచ్చని చెబుతారు.

మిథున రాశి

మిథున రాశి వారు గోమాతకు పచ్చగడ్డి సమర్పించడంతో పాటు శివుడికి బిల్వపత్రాలతో పూజ చేయాలని సూచిస్తారు. పేదలకు ఆర్థిక సహాయం చేయడం లేదా అన్నదానం చేయడం మంచిదని జ్యోతిష్య విశ్వాసం.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలని చెబుతారు. పేదలకు అన్నదానం చేయడం, ఆలయంలో పాలు, బియ్యం సమర్పించడం వంటివి చేయవచ్చు.

సింహ రాశి

సింహ రాశి వారు శివలింగానికి నీటితో, తేనెతో అభిషేకం చేయాలని సూచిస్తారు. సూర్య నమస్కారాలు చేయడంతో పాటు ఎరుపు రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం మంచిదని జ్యోతిష్య నమ్మకం.


కన్యా రాశి

కన్యా రాశి వారు వినాయకుడికి గరికతో పూజ చేయాలని చెబుతారు. శివుడిని ఆరాధించడం, అనాథలకు సహాయం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయవచ్చు. పేదలకు ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం కూడా మంచిదని నమ్మకం.

తులా రాశి

తులా రాశి వారు శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని సూచిస్తారు. గుడిలో తెల్లని వస్త్రాలు దానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం శుభఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య విశ్వాసం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించాలి. హనుమాన్ చాలీసా పఠించడం, పేదలకు నల్ల నువ్వులు దానం చేయడం మంచిదని చెబుతారు. గోమాతకు గోధుమలు, తోటకూర వంటి ఆహారాన్ని అందించవచ్చని జ్యోతిష్య నమ్మకం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు శివుడికి పసుపు రంగు పూలు, చందనం సమర్పించి పూజ చేయాలని సూచిస్తారు. గురువులకు పసుపు రంగు వస్త్రాలు, శనగలు దానం చేయడం మంచిదని చెబుతారు. పేదలకు ఆర్థిక సహాయం చేయడం కూడా శుభప్రదమని నమ్మకం.

మకర రాశి

మకర రాశి వారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలని సూచిస్తారు. నల్లటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయవచ్చు. పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం కూడా మంచిదని జ్యోతిష్య విశ్వాసం.

కుంభ రాశి

కుంభ రాశి వారు శివ సహస్రనామాన్ని పఠించడం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం చేయవచ్చు. నువ్వుల నూనెను దానం చేయడం శుభప్రదమని జ్యోతిష్య నమ్మకం.

మీన రాశి

మీన రాశి వారు శివలింగానికి పసుపు, కుంకుమతో పూజ చేయాలని సూచిస్తారు. పేదలకు అన్నదానం చేయడం, పసుపు రంగు పండ్లను దానం చేయడం మంచిదని జ్యోతిష్య విశ్వాసం.

Note: ఇందులోని సమాచారం జ్యోతిష్య, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

వినాయకుని మట్టి విగ్రహాలే ఎందుకు? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలెందుకు వద్దు?

వినాయక విగ్రహం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

Updated Date - Sep 10 , 2026 | 05:15 PM