కృష్ణాష్టమి 2026.. అదృష్టం కోసం ఈ వస్తువును ఇంటికి తీసుకురండి!
ABN , Publish Date - Sep 04 , 2026 | 02:42 PM
కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ పర్వదినం సందర్భంగా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదమని వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం లేదా పూజలో ఉపయోగించడం శుభప్రదమని వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు ఎదురవుతున్న వారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు కొన్ని సులభమైన పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
చెక్క లేదా వెండి వేణువు
శ్రీకృష్ణుడి చేతిలో ఎప్పుడూ కనిపించే వేణువుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో లేదా కార్యాలయంలో వేణువును ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. జన్మాష్టమి రోజున చెక్క లేదా వెండి వేణువును ఇంటి పూజా గదిలో లేదా కార్యాలయంలో ఈశాన్య దిశలో ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం.
నెమలి ఈకలు
శ్రీకృష్ణుడి అలంకరణలో నెమలి ఈకకు ప్రత్యేక స్థానం ఉంది. నెమలి ఈకలను ఇంట్లో ఉంచితే ప్రతికూలతలు తొలగి శుభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. జన్మాష్టమి రోజున నెమలి ఈకలను ఇంట్లో పూజా స్థలంలో లేదా కార్యాలయంలో ఉంచుకోవచ్చు. వ్యాపారంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగడానికి, కొత్త అవకాశాలు రావడానికి ఇది ఉపయోగపడుతుందని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి.
వెండి పాత్రలో వెన్న నైవేద్యం
వెన్న అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. అందుకే జన్మాష్టమి రోజున వెన్నను నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. వీలైతే వెండి పాత్రలో వెన్నను ఉంచి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజ పూర్తయిన తర్వాత ఆ వెండి పాత్రను ఇంట్లోని సురక్షితమైన ప్రదేశంలో లేదా కార్యాలయంలో ఉంచుకోవడం శుభప్రదమని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సంపద పెరుగుతాయని విశ్వాసం.
Note: ఇందులోని సమాచారం వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
రక్షాబంధన్ 2026.. రాఖీ కట్టే సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథలు
దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు