ప్రియుడితో ఫోన్‌లో మాటలు.. ఏడుస్తున్న మూడేళ్ల కుమారుడి గొంతు నొక్కేసింది..
ABN , Publish Date - Jul 29 , 2026 | 08:37 AM
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో అడ్డు వచ్చిన మూడేళ్ల కుమారుడిని ఓ తల్లి కడతేర్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో అడ్డు వచ్చిన మూడేళ్ల కుమారుడిని ఓ తల్లి కడతేర్చింది. మాట్లాడనివ్వకుండా నిరంతరం ఏడుస్తుండటంతో అభం శుభం తెలియని చిన్నారిని గొంతునులిమి హత్య చేసింది. ఈ దారుణ ఘటన దాదాపు నెల రోజుల తర్వాత బయటపడింది (Mother killed child).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మథురకు చెందిన రుచి జిందాల్ అనే 32 ఏళ్ల మహిళ జూన్ 28వ తేదీన తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడు. పలుమార్లు నచ్చజెప్పినా ఏడుపు ఆపకపోవడంతో ఆ తల్లి ఆగ్రహానికి గురైంది. చిన్నారిని గొంతునులిమి చంపేసింది. ఆ విషయాన్ని దాచిపెట్టి, బాలుడు సహజంగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. ముందురోజు వేసిన పోలియో చుక్కలు వికటించడం వల్ల చనిపోయి ఉంటాడని అందరినీ నమ్మించింది (Uttar Pradesh Crime).
రుచి ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఆమెను ప్రశ్నించాడు (3-Year-Old Boy killed). విచారణలో ఆమె నిజాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రుచిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా వేరే వ్యక్తితో తరచుగా మాట్లాడుతున్నట్టు తేలింది. ఆ చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం చేయిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్.. 5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్..
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..