చీరలు కొనివ్వలేదని భర్తను చంపేసింది.. కుక్కర్ మూతతో కొట్టి గొంతు నులిమేసింది..
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:15 AM
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు చీరలు కొనివ్వలేదన్న కోపంతో ఓ మహిళ తన భర్తపై క్రూరంగా దాడి చేసింది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. తనకు చీరలు కొనివ్వలేదన్న కోపంతో ఓ మహిళ తన భర్తపై క్రూరంగా దాడి చేసింది. కుక్కర్ మూతతో తలపై కొట్టి అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు (Wife killed husband).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బద్లాపూర్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల సునీతాదేవి, తన భర్త హరేరామ్ సింగ్ (35)తో జులై 19న చీరల విషయంలో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య వాదనలు తీవ్రరూపం దాల్చాయి. తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత ముందుగా ప్రెజర్ కుక్కర్ మూతతో భర్తపై దాడి చేసింది. అనంతరం గొంతు నులిమి హత్య చేసింది (Cooker lid attack).
హత్య నుంచి తప్పించుకునేందుకు సునీత పోలీసులను తప్పుదోవ పట్టింది (Saree dispute). ప్రమాదవశాత్తు తలపై దెబ్బ తగలడంతో తన భర్త మరణించారని పోలీసులకు చెప్పింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా తొలుత పోలీసులు ప్రమాదవశాత్తు మరణించినట్టు కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో బాధితుడి గొంతు నులిమి చంపినట్టు తేలింది. దీంతో సునీతను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఇవి కూడా చదవండి..
నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్
పసిడి ధరలు మరికొంత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..