ఊటీలో పులి దాడి.. ఒకరి మృతి
ABN , Publish Date - Feb 25 , 2026 | 01:12 PM
నీలగిరి జిల్లా ఊటీ షూటింగ్ మట్టమ్ సమీపం చిన్నకడిమందు ప్రాంతంలో పులి దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నై: నీలగిరి జిల్లా ఊటీ షూటింగ్ మట్టమ్ సమీపం చిన్నకడిమందు ప్రాంతంలో పులి దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో పులి సంచారాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోని అటవీ శాఖ అధికారుల తీరును ఖండిస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు.
ఇటీవలి కాలంలో చిన్నకడిమందు తదితర ప్రాంతాల్లో అడవి నుంచి ఆహారం కోసం వెతుక్కుంటూ ఎలుగుబంట్లు, పులులు, ఏనుగులు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. దీంతో స్థానికులు రాత్రిపూట కంటిపై కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఊటీ షూటింగ్ మట్టమ్ వద్ద చిట్టడవిలో ఓ మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అటవీ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు జరిపిన దర్యాప్తులో పులి దాడిలో గాయపడి మృతి చెందిన వ్యక్తి శబుస్థాల్ కుట్టన్(55)గా గుర్తించారు. ఇదిలాఉండగా వన్య మృగాలు జనావాస ప్రాంతాల్లో ప్రవేశించకుండా అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఖండిస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్
Read Latest Telangana News and National News