Share News

కెరీర్ ఆశ చూపి, మైనర్‌పై మూడేళ్లపాటు అత్యాచారం చేసిన కోచ్!

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:04 PM

ఓ ఫుట్‌బాల్ కోచ్ కెరీర్ ఆశ చూపి మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను అరెస్టు చేశారు.

కెరీర్ ఆశ చూపి, మైనర్‌పై మూడేళ్లపాటు అత్యాచారం చేసిన కోచ్!
Football Coach Arrested for Alleged Rape and Blackmail of Minor Player

పాల్ఘర్, (మహారాష్ట్ర) జూన్ 13: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక ఫుట్‌బాల్ కోచ్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మైనర్ క్రీడాకారిణిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై సదరు ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్‌ను అరెస్టు చేశారు. నిందితుడు, 36 ఏళ్ల అభిజిత్ మెండల్‌పై బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, 2023లో వసాయిలోని అతని ఫుట్‌బాల్ శిక్షణా అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికపై మెండల్ పదేపదే అత్యాచారం చేశాడు. అతను ఆ బాలికకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలను కూడా తీసి, తరువాత వాటిని ఉపయోగించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన ఫిర్యాదులో, బాధితురాలు.. మెండల్ మొదట తన నమ్మకాన్ని పొంది, ఆపై ఫుట్‌బాల్‌లో పెద్ద అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపి తనను ప్రలోభపెట్టాడని పేర్కొంది.


గత మూడేళ్లుగా, అతను ఆమెపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో విసిగిపోయిన బాధితురాలు, అతనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత నిందితుడు తన వద్ద ఉన్న వీడియోలు, పొటోలతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని తెలుస్తోంది. తన డిమాండ్లకు అంగీకరించకపోతే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

నిరంతర మానసిక వేధింపులతో తీవ్రంగా కలత చెందిన ఆ బాలిక, చివరకు తన కుటుంబానికి ఈ విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా, వసాయ్‌లోని మణిక్‌పూర్ పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం మెండల్‌ను అరెస్టు చేశారు. అతనిపై అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


ఇవీ చదవండి:

అస్సాంలో కూలిన ఐఏఎఫ్ ఏఎన్-32 విమానం.. పైలట్ మృతి.!

వరుస విజయాలతో దేశ రక్షణ రంగంలో డీఆర్‌డీఓ సరికొత్త చరిత్ర

Updated Date - Jun 13 , 2026 | 04:06 PM