Share News

భోజనం ఆలస్యంగా పెట్టిందని.. వదిన తల నరికేశాడు..

ABN , Publish Date - Jul 30 , 2026 | 08:28 AM

బిహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన వదిన తలను గొడ్డలితో నరికేశాడు.

భోజనం ఆలస్యంగా పెట్టిందని.. వదిన తల నరికేశాడు..
Bihar crime

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన వదిన తలను గొడ్డలితో నరికేశాడు. అనంతరం ఆమె తలను ఇంటి ముందు చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని 25 ఏళ్ల అన్షు దేవిగా గుర్తించారు (Bihar crime).


భర్త ధర్మేంద్ర కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పొలాలకు వెళ్లగా, అన్షు దేవి మాత్రమే ఇంట్లో ఉంది. అదే సమయంలో ఆమె మరిది కునాల్ కుమార్ ఇంటికి వచ్చి భోజనం పెట్టాలని కోరాడు. భోజనం వడ్డించడంలో ఆలస్యం కావడంతో ఆగ్రహానికి లోనైన అతడు గొడ్డలితో దాడి చేశాడు. ఆమె తలను నరికేసి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు (Bihar shocking incident).


హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోకుండా ఇంటి సమీపంలోనే కూర్చున్నాడు (Sister-in-law killed). గ్రామస్థులు ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఎప్పుడూ డ్రగ్స్‌ మత్తులో ఉంటాడని గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..

Updated Date - Jul 30 , 2026 | 09:48 AM