Share News

జోహో సొంత సర్వర్‌ ‘నాథూ లా’

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:24 AM

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ జోహో హార్డ్‌వేర్‌లోనూ తన సత్తా చాటుతోంది. ‘నాథూ లా’ పేరుతో సొంతంగా సర్వర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సర్వర్‌ తో ఏఐ మౌలిక సదుపాయాలు...

జోహో సొంత సర్వర్‌ ‘నాథూ లా’

చెన్నై: సాఫ్ట్‌వేర్‌ కంపెనీ జోహో హార్డ్‌వేర్‌లోనూ తన సత్తా చాటుతోంది. ‘నాథూ లా’ పేరుతో సొంతంగా సర్వర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సర్వర్‌ తో ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా కేంద్రాల ఇంధన ఖర్చులు 12 నుంచి 18 శాతం, కొనుగోలు ఖర్చులు 20 నుంచి 30 శాతం తగ్గుతాయని తెలిపింది. పెరుగుతున్న కంప్యూటింగ్‌ పవర్‌తో ఐటీ కంపెనీల మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జోహో ఈ సర్వర్‌ను అభివృద్ధి చేయడం విశేషం. నాగ్‌పూర్‌లోని జోహో ఇంజనీరింగ్‌ టీమ్‌.. ఇంటెల్‌తో కలిసి ఈ సర్వర్‌ను అభివృద్ధి చేసింది. జోహో నిర్వహణలోని కొన్ని డేటా కేంద్రాల్లో ఇప్పటికే నాథూ లా సర్వర్‌ ను వినియోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 03:24 AM