Share News

Volvo Electric Cars India: త్వరలో మరిన్ని కొత్త ఈవీ కార్లు

ABN , Publish Date - Jan 12 , 2026 | 02:13 AM

భారత ఆటోమొబైల్‌ రంగాన్ని సంపూర్ణ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ దిశగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు స్వీడన్‌ లగ్జరీ కార్ల దిగ్గజం వోల్వో ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ విక్రయించే...

Volvo Electric Cars India:  త్వరలో మరిన్ని కొత్త ఈవీ కార్లు

  • వోల్వో కార్‌ ఇండియా

న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్‌ రంగాన్ని సంపూర్ణ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ దిశగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు స్వీడన్‌ లగ్జరీ కార్ల దిగ్గజం వోల్వో ప్రకటించింది. ఇప్పటికే కంపెనీ విక్రయించే ప్రతి నాలుగు కార్లలో ఒక ఎలక్ట్రిక్‌ వాహనం ఉందని, ఈ ఏడాదిలో మరిన్ని కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వోల్వో కార్‌ ఇండియా ఏండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎ్‌సటీ 2.0లో ఎలక్ట్రిక్‌ వాహనాలపై జీఎ్‌సటీ రేట్లు తగ్గించడంతో ఈవీలకు మరింత ఆదరణ లభిస్తోందన్నారు. తమ మైల్డ్‌-హ్రైబిడ్‌ ఎస్‌యూవీలకు డిమాండ్‌ మరింత పెరిగిందని..ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60 వంటి మోడళ్లు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని పేర్కొన్నారు. ఈవీ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్‌ (ఐసీఈ) మోడళ్ల ఆధునీకరణపై దృష్టి సారించినట్లు మల్హోత్రా చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్

విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

For More AP News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 02:13 AM