Share News

వీసా లేఆఫ్స్ 2026.. భారత ఉద్యోగుల పరిస్థితి ఇది?

ABN , Publish Date - Aug 05 , 2026 | 01:14 PM

భారతదేశంలోని బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ కార్పొరేట్ కేంద్రాలలో వీసాలో 3,500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్గత సమాచారం మేరకు.. వీసాలోని కొన్ని విభాగాలలో మొత్తం టీమ్‌లను తొలగించారు.

వీసా లేఆఫ్స్ 2026.. భారత ఉద్యోగుల పరిస్థితి ఇది?
Visa layoffs India

ఇంటర్‌నెట్ డెస్క్: పేమెంట్స్ దిగ్గజం వీసా (Visa) సంస్థ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 7 శాతం.. అంటే 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. తాజా లేఆఫ్స్ కారణంగా భారత్‌లో ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారనే దానిపై సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. భారతదేశంలోని బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ కార్పొరేట్ కేంద్రాలలో వీసాలో 3,500 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్గత సమాచారం మేరకు..


వీసాలోని కొన్ని విభాగాలలో మొత్తం టీమ్‌లను తొలగించారు. ఓ చోట 28 మంది సభ్యులు ఉన్న టీమ్‌లో 10 మందిని ఒకేసారి తీసేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు కంపెనీలో 20 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ డైరెక్టర్లు, మేనేజర్లు ఉన్నారు. జులై 29వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఉద్యోగులకు లేఆఫ్ ఈ-మెయిల్స్ వచ్చాయి. వీసా కంపెనీ.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి 15 నుంచి 30 రోజుల నోటీస్ పీరియడ్, సెవరేజ్ ప్యాకేజీలు ఇచ్చింది.


వీసా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. లేఆఫ్స్‌పై కంపెనీ సీఈఓ ర్యాన్ మెక్‌ఇనెర్నీ స్పందిస్తూ.. ‘ఈ వ్యూహంలో ఏఐ ఒక ప్రధాన భాగంగా మారింది. మానవ పర్యవేక్షణతో పనులను స్వయంగా పూర్తి చేయగల 'ఏజెంటిక్ ఏఐ' వ్యవస్థలపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారిస్తోంది’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆర్బీఐ బ్యాంకు ఉద్యోగిగా ఇషాన్ కిషన్.. ఫొటోలు వైరల్!

నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్ రావు

Updated Date - Aug 05 , 2026 | 01:14 PM