వసుధ ఫార్మాకు భారీ ఊరట
ABN , Publish Date - May 02 , 2026 | 02:33 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్ ఉత్పత్తుల తయారీ సంస్థ వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ (వీపీసీఎల్)నకు పెద్దఊరట లభించింది. ‘ఫెంటానిల్’ అనే...
‘ఫెంటానిల్’ కేసు నుంచి విముక్తి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్ ఉత్పత్తుల తయారీ సంస్థ వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ (వీపీసీఎల్)నకు పెద్దఊరట లభించింది. ‘ఫెంటానిల్’ అనే ముడి పదార్ధాన్ని ఈ సంస్థ అక్రమంగా అమెరికాకు తరలిస్తోందనే అభియోగాలను అమెరికా న్యాయ శాఖ (డీఓజే) వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించి డీఓజే తో నాన్ ప్రాసిక్యూషన్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. దీంతో అమెరికా కోర్టులో దీనికి సంబంధించి తమపై నమోదైన కేసును కూడా కొట్టివేసినట్టు తెలిపింది. తమపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవని నిర్ధారించుకున్నాకే అమెరికా న్యాయ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అత్యంత శక్తివంతమైన ఫెంటానిల్ ను వసుధ ఫార్మా అమెరికాకు అక్రమ రవాణ చేస్తున్నట్టు గత ఏడాది వార్తలు గుప్పుమన్నాయి.
మరింత అకింతభావంతో పని చేస్తాం: డీఓజే నిర్ణయంపై వసుధ ఫార్మా హర్షం వ్యక్తం చేసింది. డీఓజే ఇలా కేసును ముగించడంపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంతెన అశోక్ శ్రీనివాస రాజు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో మరింత జాగ్రత్తగా, అంకిత భావంతో ఖాతాదారుల సేవకు అంకితమవుతామని మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంతెన ఆనంద్ చెప్పారు. గత మూడు దశాబ్దాలుగా బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారు చేస్తూ, 4,000 మంది ఉద్యోగులతో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. కాగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) కింద సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని వసుధ ఫార్మా గుర్తు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News