Share News

ట్రంప్ ప్రకటనకు ముందు ఏం జరిగింది.. చమురుపై రూ.5,400 కోట్ల ట్రేడింగ్..

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:46 PM

ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా చమురు ధరలు దిగి వచ్చాయి.

ట్రంప్ ప్రకటనకు ముందు ఏం జరిగింది.. చమురుపై రూ.5,400 కోట్ల ట్రేడింగ్..
US insider trading claim

ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా చమురు ధరలు దిగి వచ్చాయి. సోమవారం ఉదయం బ్రెంట్ క్రూడాయిల్ ధర 114 డాలర్లకు చేరింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఏకంగా 13 శాతం తగ్గి 97 డాలర్లకు చేరుకుంది. అయితే ట్రంప్ ప్రకటనకు ముందు చమురు మార్కెట్లలో రూ.5,400 కోట్ల ట్రేడింగ్ జరగడం అనుమానాస్పదంగా మారింది ($580 million bet news).


న్యూయార్క్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6.50 గంటల సమయంలో బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్‌తో సంబంధం ఉన్న దాదాపు 6,200 ఫ్యూచర్ కాంట్రాక్టులు ట్రేడ్ అయ్యాయి. చమురు ధరలు తగ్గుతాయని, స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని ఈ కాంట్రాక్టులతో ట్రేడర్లు బెట్టింగ్ చేశారు. ఈ బెట్టింగ్ విలువ దాదాపు 580 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5400 కోట్లు) ఉంటుందని అంచనా. ఈ ట్రేడింగ్ జరిగిన కేవలం 15 నిమిషాల తర్వాత ఇరాన్‌పై దాడులను వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు (US insider trading claim).


ట్రంప్ ప్రకటనను ముందే ఊహించి భారీ స్థాయిలో ట్రేడింగ్ జరగడం చాలా అనుమానాలకు తావిస్తోంది (Trump post controversy). ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఒకే సంస్థ ఉందా? లేదా ఎక్కువ మంది ట్రేడింగ్ చేశారా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను అమెరికా ప్రభుత్వం ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, పూర్తిగా అసత్యాలని వైట్‌హౌస్ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. రంగంలోకి సౌదీ అరేబియా, యూఏఈ..


వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Mar 24 , 2026 | 05:46 PM