హైదరాబాద్‌లో థియోమ్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:32 AM
హైదరాబాద్‌లో మరో అమెరికా కంపెనీ కొలువు తీరింది. పలు రంగాలకు చెందిన కంపెనీలకు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో మరో అమెరికా కంపెనీ కొలువు తీరింది. పలు రంగాలకు చెందిన కంపెనీలకు కృత్రిమ మేధ (ఏఐ), డేటా సెక్యూరిటీ సేవలందించే ‘థియోమ్’ హైదరాబాద్ గచ్చిబౌలిలో తన గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన క్లయింట్ కంపెనీలకు అధునాతన డేటా సెక్యూరిటీ, క్లౌడ్ ప్రొటెక్షన్, ఏఐ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సేవలు, ఉత్పత్తులను అందించనుంది. ‘మా అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ కేంద్రం ఒక మైలురాయి’ అని థియోమ్ సీఈఓ నవీంద్ర యాదవ్ చెప్పారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 50 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా ఏడాది చివరికి మరో 50 మందిని నియమించుకోనున్నట్టు యాదవ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News