Share News

యూబీఐ లాభం రూ.5,641 కోట్లు

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:00 AM

ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో మొదటి త్రైమాసికానికి(క్యూ1) ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.5,641.52 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

యూబీఐ లాభం రూ.5,641 కోట్లు

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో మొదటి త్రైమాసికానికి(క్యూ1) ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.5,641.52 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.4,427.94 కోట్ల లాభంతో పోలిస్తే 27.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. వడ్డీ ఆదాయం పెరగడంతోపాటు మార్జిన్లు, ఆస్తుల నాణ్యతలో మెరుగుదల ఇందుకు దోహదపడ్డాయి. ఈ క్యూ1లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 1.05 శాతం పెరిగి రూ.27,203 కోట్లకు చేరుకోగా.. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.80 శాతానికి పెరిగింది. మున్ముందు మార్జిన్‌ మరింత మెరుగుపడవచ్చని యూబీఐ ఎండీ, సీఈఓ ఆశీష్‌ పాండే ధీమా వ్యక్తం చేశారు.

200 కోట్ల డాలర్ల ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్ల సమీకరణ లక్ష్యం

ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన ఫారిన్‌ కరెన్సీ నాన్‌ రెసిడెంట్‌-బ్యాంక్‌ (ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ) డిపాజిట్‌ ప్రత్యేక విండో ద్వారా ఇప్పటివరకు 10.6 కోట్ల డాలర్ల డిపాజిట్లను సమీకరించినట్లు ఆశీష్‌ పాండే తెలిపారు. ఈ సెప్టెంబరుకల్లా 150-200 కోట్ల డాలర్ల మేర ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్ల ను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. బ్యాంకు ఈ డిపాజిట్లపై 6.10-6.60% వార్షిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:00 AM