ఉబర్‌లో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బ్రేక్..
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:50 PM
ప్రముఖ రైడ్‌హెయిలింగ్ సంస్థ ఉబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సుమారు 3,300 ఉద్యోగాలను తొలగించిన సంస్థ.. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా కఠినతరం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సుమారు 3,300 ఉద్యోగాలను తొలగించిన సంస్థ.. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా కఠినతరం చేసింది. ఇకపై పూర్తిగా రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల సంఖ్యను సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 1 శాతానికే పరిమితం చేయనుంది. అంటే ఇంటి నుంచే శాశ్వతంగా పనిచేసే విధానం దాదాపుగా ముగిసినట్లే (Uber Layoffs).
దాదాపు 3,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఉబర్ సెప్టెంబర్ 2న ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం కార్పొరేట్ ఉద్యోగుల్లో సుమారు 10 శాతానికి సమానం. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉబర్ చేపట్టిన అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే. సంస్థలో మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించడం, చిన్న టీమ్‌లను విలీనం చేయడం, నిర్ణయాలు వేగంగా తీసుకునేలా సంస్థాగత నిర్మాణాన్ని సరళీకరించడం తమ ప్రధాన లక్ష్యాలని సీఈఓ దారా ఖోస్రోషాహి తెలిపారు. మేనేజర్ల సంఖ్యను కూడా సుమారు 20 శాతం తగ్గించనున్నట్లు సంస్థ వెల్లడించింది (Uber Work From Home).
ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉబర్ తీసుకున్న మరో కీలక నిర్ణయం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి సంబంధించినది (Uber Remote Work Policy). వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పరిమితం చేసినప్పటికీ ఉబర్ పూర్తిగా ఐదు రోజుల ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం లేదు. సంస్థ ఇప్పటికే అమల్లో ఉన్న హైబ్రిడ్ వర్క్ పాలసీని కొనసాగించనుంది. దీని ప్రకారం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయం నుంచి పనిచేయాలి.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..