Share News

Trump Iran tariffs: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25 శాతం సుంకాలు.. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు ఇబ్బందేనా..

ABN , Publish Date - Jan 13 , 2026 | 09:13 AM

ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటుతో కునారిల్లుతున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు వేశారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

Trump Iran tariffs: ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25 శాతం సుంకాలు.. ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు ఇబ్బందేనా..
Donald Trump

ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటుతో కునారిల్లుతున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు వేశారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. గత మూడు వారాలుగా ఇరాన్‌ ప్రభుత్వంపై ప్రజలు నిరసనలు, ఆందోళనలతో తిరుగుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా జోక్యంతో ఇరాన్ ప్రభుత్వం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది (25 percent tariff Iran trade).


ఇరాన్ నిరసనలపై ట్రంప్ సైనిక చర్య చేపడతారని ఎప్పట్నుంచో ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నాయకత్వం ట్రంప్‌తో చర్చలు జరపడానికి సిద్ధమైంది. ఇరాన్ నేతలతో సమావేశం కావడానికి ట్రంప్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. పరిస్థితి సద్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో ట్రంప్ సుంకాల పేరుతో పిడుగు వేశారు. ఇరాన్ నుంచి ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యూఏఈ, ఇరాక్, భారత్ ముందు వరసలో ఉన్నాయి (US tariffs on Iran partners). ట్రంప్ నిర్ణయంతో ఈ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటాయి.


ఇరాన్ నుంచి భారత్‌కు పెట్రోలియం ఉత్పత్తులు, వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, పిస్తా, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్, ఐరన్, స్టీల్ వంటి ఉత్పత్తులు దిగుమతి అవుతాయి (Trump sanctions Iran). భారత్‌ నుంచి ఇరాన్‌కు బియ్యం, టీ పౌడర్, పంచదార, అరటిపళ్లు, ఫార్మా ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, ఇంజినీరింగ్ వస్తువులు, మెటల్ ఉత్పత్తులు, బట్టలు, మిరియాలు వంటి స్పైసెస్, రబ్బర్, పాలిస్టర్ వంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. తాజాగా ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో ఇరాన్‌తో భారత్ వాణిజ్యం పరిస్థితి ఏమవుతుందో కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.


ఇవి కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఏడాదిలో లక్ష వీసాలు రద్దు..

Updated Date - Jan 13 , 2026 | 10:04 AM