బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
ABN , Publish Date - Feb 06 , 2026 | 10:19 AM
ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరల విషయానికి వస్తే.. పది గ్రాముల 24, 22,18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.2070, రూ. 1900, రూ.1560ల మేర తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఏ శుభకార్యం జరిగినా బంగారు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏడాది క్రితం లక్ష రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. వారం క్రితం బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,80,000 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. అయితే, ఊహించని విధంగా రెండు రోజులకే బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ రోజు బంగారం ధరలు..
ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరల విషయానికి వస్తే.. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. పది గ్రాముల 24, 22,18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.2070, రూ. 1900, రూ.1560లు తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,39,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,260 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
గత రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.3,00,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.30,000 దగ్గర ట్రేడ్ అయింది. నేడు కిలోపై రూ.20,000, 100 గ్రాములపై రూ.2000 మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,80,000 వద్ద, 100 గ్రాముల వెండి ధర రూ.28,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు(24 క్యారెట్లు.. గ్రాముకు)
హైదరాబాద్ రూ. 15,484.10
విజయవాడ రూ. 15,517.89
ఢిల్లీ రూ. 15,513.61
ముంబై రూ. 15,484.10
వడోదర రూ. 15,493.94
కోల్‌కతా రూ. 15,484.10
చెన్నై రూ. 15,484.10
బెంగళూరు రూ. 15,484.10
కేరళ రూ. 15,517.89
పుణే రూ. 15,484.10
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
ఎమ్మెల్సీ నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్ల ఎగరవేత
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దుర్మరణం