Gold Price Update: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:16 AM
గత కొద్దిరోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి భారీ ఊరటను ఇచ్చాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,620 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ముంబై, జనవరి 18: భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. బంగారం అంటే ఇష్టపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తికాదు. ఏ శుభకార్యం జరిగినా కూడా బంగారు ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏడాది క్రితం లక్ష రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. గత కొద్దిరోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి భారీ ఊరటను ఇచ్చాయి.
ఈ రోజు బంగారం ధరలు..
ఈ రోజు (శుక్రవారం) బంగారం ధరల విషయానికి వస్తే.. పది గ్రాముల 24, 22,18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.220, రూ. 200, రూ.170లు తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్‌లలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,620 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,31,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,720 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఇలా..
గత రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కిలో వెండి ధర రూ.3,10,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.31,000 దగ్గర ట్రేడ్ అయింది. నేడు కిలోపై రూ.4000, 100 గ్రాములపై రూ.400 మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.3,06,000 వద్ద, 100 గ్రాముల వెండి ధర రూ.30,600 వద్ద ట్రేడ్ అయింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు.. అంచనా)
హైదరాబాద్ రూ. 14,442
విజయవాడ రూ. 14,400
ఢిల్లీ రూ. 14,429
ముంబై రూ. 14,415
వడోదర రూ. 14,420
కోల్‌కతా రూ. 14,413
చెన్నై రూ. 14,500
బెంగళూరు రూ. 14,412
కేరళ రూ. 14,420
పుణే రూ. 14,417
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనం.. మరో హ్యాట్రిక్ నమోదు
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది