పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:29 AM
గతకొన్ని రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఇవాళ కూడా అదే బాటలో వెళ్తున్నాయి. పది గ్రాముల పసిడి పై దాదాపు రూ.2 వేలు పెరిగింది. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ డెస్క్: మహిళలకు బంగారం(Gold) అంటే ఎంతో ఇష్టం. ఇక ఈ పసిడి కేవలం అలంకరణకే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంతో భరోసా ఉంటుంది. ఆపద సమయాల్లో ఈ పసిడినే ఆదుకుంటుంది. అందుకే బంగారాన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో రోజూ బంగారం ధరల గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. ఇటీవల పసిడి ధర పెరుగుతూ వస్తుంది. ఇవాళ(శనివారం) కూడా పది గ్రాములపై దాదాపు రెండు వేలు పెరిగింది. మరి.. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దా...
ఈ రోజు (ఫిబ్రవరి 14) ఉదయం 11.00 గంటల సమయానికి హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,970 పెరిగి.. రూ.1,57,750కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1800 పెరిగి.. రూ.1,44,600కి చేరింది. అలానే 18 క్యారెట్ల పది గ్రాముల ధరపై రూ.1470 పెరిగి.. రూ.1,18,310కి పెరిగింది.
అలానే భాగ్యనగరంలో కిలో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతం వెండి ధర రూ.2,80,000 ఉంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1970 పెరిగి... రూ.1,57,900కి చేరింది. అలానే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. రూ.1800 పెరిగి.. రూ.1,44,750కి చేరుకుంది. ఇక, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1470 పెరిగి.. రూ.1,44,750కి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,80,000 ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి:
వెనెజువెలా చమురు కొనుగోలు.. రిలయన్స్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్!