Share News

టెస్లా కొత్త కారు వైఎల్‌

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:15 AM

అమెరికాకు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా కొత్త ఎస్‌యూవీ వైఎల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.61.99 లక్షలు. మూడు వరుస ల్లో సీట్లుండే ఈ కారు 5 సెకండ్ల వ్యవధిలోనే...

టెస్లా కొత్త కారు వైఎల్‌

ధర రూ.61.99 లక్షలు

ముంబై: అమెరికాకు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ టెస్లా కొత్త ఎస్‌యూవీ వైఎల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.61.99 లక్షలు. మూడు వరుస ల్లో సీట్లుండే ఈ కారు 5 సెకండ్ల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గంటకి 201 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది భారత మార్కెట్లో టెస్లా కంపెనీ విడుదల చేసిన రెండో కారు. ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంటుంది. 15 నిముషాల సూపర్‌ చార్జింగ్‌తో ఈ కారు 288 కిలోమీటర్లు నడుస్తుంది.

ఈ త్రైమాసికంలో హైదరాబాద్‌లోకి...

తాము ఇప్పటివరకు ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్‌లలో మూడు ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్లు ప్రారంభించామని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ శరద్‌ అగర్వాల్‌ తెలిపారు. తమ నెట్‌వర్క్‌ విస్తరణలో భాగంగా ఈ త్రైమాసికంలో హైదరాబాద్‌లో సర్వీస్‌ సెంటర్‌, బాడీషాప్‌ ప్రారంభించనున్నట్టు చెప్పారు. కస్టమర్ల నివాసాల వద్దనే చార్జింగ్‌ వసతులు ఏర్పాటు చేయాలని తాము భావిస్తున్నట్టు తెలిపారు. హైవేలన్నింటితో పాటు ఢిల్లీ, చండీగఢ్‌, జైపూర్‌, అహ్మదాబాద్‌, పూణె, బెంగళూరు, చెన్నైలలో సూపర్‌ చార్జింగ్‌ వసతులు అందుబాటులో ఉంచనున్నామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 05:15 AM