Techno Paints IPO: పబ్లిక్ ఇష్యూకి టెక్నో పెయింట్స్
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:50 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో...
రూ.500 కోట్ల సమీకరణ లక్ష్యం
బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్ టెండుల్కర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఇందుకు సంబంధించి సెబీకి ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించనున్నట్లు కంపెనీ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. శనివారం నాడిక్కడ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ను నియమించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నిధులను కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం : గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో కంపెనీ రెవెన్యూ రూ.210 కోట్లుగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కాగా 2029-30 నాటికి కంపెనీ ఆదాయాన్ని రూ.2,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్లను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
Read Latest Telangana News And Telugu News