Share News

ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:16 AM

ఐటీ కంపెనీల్లోనూ నియామకాల మాంద్యం కొనసాగుతోంది. గతంలోలా ఎడాపెడా నియామకాలకు కంపెనీలు...

ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు

టీసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లోనూ నియామకాల మాంద్యం కొనసాగుతోంది. గతంలోలా ఎడాపెడా నియామకాలకు కంపెనీలు ఫుల్‌స్టాప్‌ పెట్టేశాయి. ఇంటర్నల్‌ ఆపరేషన్లు, సొల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్స్‌, క్లయింట్‌ స్పెసిఫిక్‌ పనుల కోసం ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్‌.. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఏజెంట్లపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. దీంతో కంపెనీలో ఉద్యోగులతో సమాన సంఖ్యలో ఏఐ ఆధారిత ఏజెంట్లు పనిచేసే రోజులు ఎంతో దూరం లో లేవని కంపెనీ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. అలాగని ఉన్న ఉద్యోగులను తగ్గించే ఆలోచన కూడా తమకు లేదన్నారు. ఈ మార్పు పూర్తయ్యాక ఏఐ ద్వారా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 10 , 2026 | 03:16 AM