టాటా సన్స్ ఏజీఎమ్ వాయిదా.. కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి..
ABN , Publish Date - Aug 18 , 2026 | 05:11 PM
టాటా సన్స్ కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ వాయిదా పడింది. మీటింగ్ జరపటానికి అవసరమైన సభ్యుల సంఖ్య (క్వోరమ్) లేకపోవటంతో మంగళవారం జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. కంపెనీ చరిత్రలో ఏజీఎమ్ వాయిదా పడటం ఇదే మొదటిసారి.
ఇంటర్‌నెట్ డెస్క్: టాటా సన్స్ కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ వాయిదా పడింది. మీటింగ్ జరపటానికి అవసరమైన సభ్యుల సంఖ్య (క్వోరమ్) లేకపోవటంతో మంగళవారం జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. కంపెనీ చరిత్రలో ఏజీఎమ్ వాయిదా పడటం ఇదే మొదటిసారి. ఓ జాతీయ మీడియా కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 108వ యాన్యువల్ జనరల్ మీటింగ్ ప్రారంభం అయింది. అయితే, జాయింట్ రిప్రెసెంటేటివ్ ఆఫ్ ది సర్ దొరాబ్జి టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ మీటింగ్‌లో లేకపోవటంతో క్వోరమ్ రిక్వైర్‌మెంట్‌ను మీటింగ్ అందుకోలేకపోయింది. దీంతో అరగంట తర్వాత మీటింగ్ వాయిదా పడింది.
క్వోరమ్ లేకపోవడానికి కారణం ఏంటంటే..
సర్ దొరాబ్జి టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు.. టాటా సన్స్‌లో ఏకంగా 51.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రెండు ట్రస్ట్‌లు సంయుక్తంగా ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర చారిటీ కమిషనర్ .. సర్ రతన్ టాటా ట్రస్ట్ మీటింగ్స్‌పై ఆంక్షలు విధించారు. సర్ రతన్ టాటా ట్రస్ట్‌పై ఆంక్షలు ఉండటం వల్ల సంయుక్త నామినేషన్ సాధ్యం కాలేదు. దీంతో రెండు ట్రస్ట్‌లకు సంబంధించిన ప్రతినిధి మీటింగ్‌లో లేకుండా పోయారు. మీటింగ్ వాయిదా పడింది. యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎప్పుడు జరపాలనే దానిపై కంపెనీ బోర్డ్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ వ్యూస్‌లో భారీ మార్పు.. ఇక వీడియో ప్లే అయిన వెంటనే వ్యూగా లెక్కింపు..
డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్.. సిడ్నీ కోర్టు కీలక తీర్పు