Share News

టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ మరో ఘనత

ABN , Publish Date - Sep 08 , 2026 | 03:48 AM

బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్ఎల్‌)ల జాయింట్‌ వెంచర్‌ అయిన టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (టీబీఏఎల్‌) మరో కీలక మైలురాయిని చేరుకుంది.

టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ మరో ఘనత
Tata Aeroteam

  • 400వ అపాచీ ఫ్యూజ్‌లేజ్‌ సరఫరా హైదరాబాద్‌ ప్లాంటులో తయారీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బోయింగ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్ఎల్‌)ల జాయింట్‌ వెంచర్‌ అయిన టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (టీబీఏఎల్‌) మరో కీలక మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లోని తన అత్యాధునిక తయారీ ప్లాంటు నుంచి ఏహెచ్‌ -64ఈ అపాచీ పోరాట హెలికాప్టర్‌కు సంబంధించిన 400వ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా తయారు చేసి సరఫరా చేసినట్టు సోమవారం ప్రకటించింది. భారత్‌లో తయారు చేసిన ఈ ఫ్యూజ్‌లేజ్‌లను పూర్తి స్థాయి హెలికాప్టర్‌కు అనుసంధానం చేసి అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల సైనిక దళాలకు సరఫరా చేస్తారు. గత ఏడాది భారత సైన్యానికి 6 అపాచీ హెలికాప్టర్లను బోయింగ్‌ సరఫరా చేసింది. భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 ఏహెచ్‌-64ఈ అపాచీలున్నాయి. 2016లో ప్రారంభమైన టీబీఏఎల్‌లో 750 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అధునాతన రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, ఏరోస్పేస్‌ తయారీ సాంకేతికతలను వినియోగిస్తూ అపాచీ హెలికాప్టర్‌కు అవసరమైన ఫ్యూజ్‌లేజ్‌ ఏరోస్ట్రక్చర్లను సంస్థ తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో 52 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఉంది. ఈ తయారీ సామర్థ్యం భారత్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థ పరిణతి, ప్రపంచ రక్షణ సప్లయ్‌ చెయిన్‌లలో భారత్‌ అనుసంధానాన్ని తెలియజేస్తుందని టీబీఏఎల్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో మరోసారి 'సర్‌' గడువు పొడిగింపు

శాసనసభ కాదు.. దుశ్శాసనసభ. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ధ్వజం!

Updated Date - Sep 08 , 2026 | 03:48 AM