Share News

తాజ్‌ జీవీకే హోటల్స్‌.. ఇక కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:55 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ పేరు మారింది. కంపెనీ పేరును కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌గా..

తాజ్‌ జీవీకే హోటల్స్‌.. ఇక కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ పేరు మారింది. కంపెనీ పేరును కృష్ణా జీవీకే లగ్జరీ హోటల్స్‌గా మార్చినట్టు తెలిపింది. తాజ్‌ జీవీకే హోటల్స్‌ ఈక్విటీలో టాటా గ్రూప్‌ కంపెనీ ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌)కు ఉన్న 25.52 శాతం వాటాను.. హోటల్‌ ప్రమోటర్‌ జీవీకే-భూపాల్‌ కుటుంబం గత ఏడాది కొనుగోలు చేసింది. దీంతో ఈ పేరు మార్పు అనివార్యమైంది. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా గత నెల 30న ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. యాజమాన్యం మారినా.. హైదరాబాద్‌, చెన్నై, ముంబై నగరాల్లో ఇప్పటికే ఉన్న ఆరు హోటల్స్‌ సహా త్వరలో బెంగళూరులో ప్రారంభమయ్యే స్టార్‌ హోటల్‌ టాటా గ్రూప్‌ తన ‘తాజ్‌’ బ్రాండ్‌ పేరుతోనే నిర్వహిస్తుందని జీవీకే-భూపాల్‌ కుటుంబం ప్రకటించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి రుణాలకు భలే గిరాకీ

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

For More Business News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:56 AM