Share News

నిమిషాల్లో గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ

ABN , Publish Date - Jul 16 , 2026 | 03:14 AM

ఆర్డరు చేసిన నిమిషాల్లోనే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు తదితరాలను డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ దేశంలోనే తొలిసారిగా వంట గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సర్వీసుకు శ్రీకారం...

నిమిషాల్లో గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ

హెచ్‌పీసీఎల్‌తో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ జట్టు

అందుబాటులో 10, 5 కిలోల సిలిండర్లు

తొలుత బెంగళూరులో సేవలు

న్యూఢిల్లీ: ఆర్డరు చేసిన నిమిషాల్లోనే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు తదితరాలను డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ దేశంలోనే తొలిసారిగా వంట గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సర్వీసుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)తో జట్టుక ట్టింది. ఈ సర్వీసు మొదటగా బెంగళూరులో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ ద్వారా హెచ్‌పీసీఎల్‌ కొత్తగా విడుదల చేసిన హెచ్‌పీ నవ్య 10 కిలోల కాంపోజిట్‌ ఎల్‌పీజీ సిలిండర్‌తోపాటు 5 కిలోల మెటల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ను ఆర్డర్‌ చేయవచ్చని కంపెనీలు తెలిపాయి. ఈ సిలిండర్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే గృహ ఎల్‌పీజీ కనెక్షన్‌ ఉండాల్సిన అవసరం లేదు. మొదటిసారి సిలిండర్‌ను కొనుగోలు చేసినప్పుడు కొత్త సిలిండర్‌ కొనుగోలుగా పరిగణిస్తారు. రీఫిల్‌ కోసం ఆర్డరు చేసినప్పుడు డెలివరీ సందర్భంగా ఖాళీ సిలిండర్‌ను తిరిగి ఇచ్చి నిండు సిలిండర్‌ను తీసుకోవచ్చు. మొదటిసారి ఆర్డరు చేసేటప్పుడు కస్టమర్లు తమ గుర్తింపు వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీసు విద్యార్థులు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, చిన్న కుటుంబాలకు ఉపయుక్తంగా ఉండనుంది.

ఇవి కూడా చదవండి...

కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు

జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 03:14 AM