సుందర్ పిచాయ్ ప్యాకేజీని భారీగా పెంచిన కంపెనీ.. ఏకంగా రూ. 6 వేల కోట్లు..
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:04 PM
కంపెనీ ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సుందర్ పిచాయ్‌కి అల్ఫాబెట్ శుభవార్త చెప్పింది. తాజాగా, భారీ మొత్తంలో ప్యాకేజీని ప్రకటించింది. ది ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం తెలిపిన వివరాల మేరకు.. పిచాయ్ ప్యాకేజీని రానున్న మూడేళ్లలో 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ అల్పాబెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నాయకత్వంలో అల్ఫాబెట్ మార్కెట్ విలువ పైపైకి దూసుకెళుతోంది. కంపెనీ భారీ మొత్తంలో లాభాలు గడిస్తోంది. గతంలో 535 బిలియన్ డాలర్లు ఉన్న మార్కెట్ విలువ ఇప్పుడు 3.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఉన్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్న సుందర్ పిచాయ్‌కి అల్ఫాబెట్ శుభవార్త చెప్పింది. తాజాగా, భారీ మొత్తంలో ప్యాకేజీని ప్రకటించింది. ది ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం తెలిపిన వివరాల మేరకు..
పిచాయ్ ప్యాకేజీని రానున్న మూడేళ్లలో 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ అల్పాబెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మన ఇండియన్ కరెన్సీలో దాని విలువ 6,361 కోట్ల రూపాయలు. 692 మిలియన్ డాలర్లలో పిచాయ్ జీతం కేవలం 2 మిలియన్ డాలర్లు మాత్రమే. మిగిలినదంతా పనితీరు ఆధారిత స్టాక్స్ (PSUs), పరిమిత స్టాక్స్ (GSUs) రూపంలో ఉండనుంది. పిచాయ్‌కి ఇచ్చే పనితీరు ఆధారిత స్టాక్స్ విలువ 126 మిలియన్ డాలర్లుగా ఉంది. పరిమిత స్టాక్స్ ద్వారా పిచాయ్ 84 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు.
అల్ఫాబెట్ అనుబంధ సంస్థలు వ్యోమోలో 130 మిలియన్ డాలర్ల విలువైన షేర్స్.. వింగ్ ఏవియేషన్‌లో 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను యజమాన్యం కేటాయించింది. పిచాయ్ నాయకత్వం మీద ఉన్న నమ్మకంతోటే ప్యాకేజీ భారీగా పెంచినట్లు అల్ఫాబెట్ బోర్డ్ పేర్కొంది. కాగా, 53 ఏళ్ల సుందర్ పిచాయ్ 2004లో అల్ఫాబెట్‌లో ఉద్యోగంలో చేరారు. క్రోమ్‌ను అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారు. అంచెలంచెలుగా ఎదిగి గూగుల్ సీఈఓ స్థానానికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్
ఖమేనీ నలుగురు కొడుకులు క్షేమం.. వెలుగుచూసిన ఫోటోలు