Share News

ఆదివారం తెరుచుకోనున్న స్టాక్ మార్కెట్లు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Jan 31 , 2026 | 07:36 PM

ఆదివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్‌లు తెరుచుకోబోతున్నాయి. సాధారణంగా శని, ఆదివారాలు స్టాక్‌మార్కెట్లకు సెలవు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో అదివారం అయినప్పటికీ ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పని చేయనున్నాయి

ఆదివారం తెరుచుకోనున్న స్టాక్ మార్కెట్లు.. కారణం ఏంటంటే..
Stock Market

ఆదివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్‌లు తెరుచుకోబోతున్నాయి. సాధారణంగా శని, ఆదివారాలు స్టాక్‌మార్కెట్లకు సెలవు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కావడంతో అదివారం అయినప్పటికీ ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు పని చేయనున్నాయి (stock markets open on Sunday). సాధారణ రోజుల మాదిరిగానే ఉదయం 9:15 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు మార్కెట్ కార్యకలాపాలు సాగుతాయి.


ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా ఆదివారం మార్కెట్ పయనం సాగబోతోంది. ఈ నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

భారత్‌కు వెనెజువెలా ముడి చమురు.. అమెరికా ఆఫర్

కాంగోలో కుప్పకూలిన గని.. 200 మంది దుర్మరణం..

Updated Date - Jan 31 , 2026 | 07:36 PM