Share News

ఆచితూచి వ్యవహరించండి..!

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:36 AM

గత వారం భారత మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనైనా శుక్రవారం మాత్రం అదరగొట్టాయి. అయితే ఈ వారం కూడా సూచీలు అదే ధోరణి కనబరిచే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు...

ఆచితూచి వ్యవహరించండి..!

గత వారం భారత మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనైనా శుక్రవారం మాత్రం అదరగొట్టాయి. అయితే ఈ వారం కూడా సూచీలు అదే ధోరణి కనబరిచే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గి, క్రూడాయిల్‌ ధరలు స్థిరత్వం సాధించే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు. ఈ వారం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడం మంచిది. ఎంపిక చేసుకున్న స్టాక్స్‌ మినహా మిగతా వాటిపై ఆచితూచి వ్యవహరించటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

చోళ ఫైనాన్స్‌: జీవితకాల గరిష్ఠం నుంచి 30 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు రెండు నెలలుగా రేంజ్‌ బౌండ్‌లో సాగుతోంది. గత వారం కాస్త స్థిరత్వాన్ని ప్రదర్శించాయి. ఆర్‌బీఐ చర్యలతో గత శుక్రవారం భారీ వాల్యూమ్‌తో 7 శాతం లాభంతో రూ.1,568 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.1,550/1,500 శ్రేణిలో ప్రవేశించి రూ.1,750 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.1,470 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

శ్రీరామ్‌ ఫైనాన్స్‌: మార్చిలో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు ఆరోగ్యకరమైన రీతిలో 20 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. రూ.870 స్థాయిలో 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద రెండోసారి మద్దతు తీసుకున్నాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగుంది. గత శుక్రవారం ఈ షేరు 7 శాతం లాభంతో రూ.954 వద్ద ముగిసింది. ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.930 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.1,100 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.900 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బజాజ్‌ ఫైనాన్స్‌: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేరులో 30 శాతం మేర దిద్దుబాటు జరిగింది. కీలకమైన రూ.780 స్థాయి వద్ద మద్దతు తీసుకుని మళ్లీ అప్‌ట్రెండ్‌ బాట పట్టాయి. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తోంది. నెల రోజుల్లోనే 18 శాతం మేర రాబడిని ఇచ్చింది. మార్కెట్‌ ఒడుదుడుకుల నేపథ్యంలో గత వారం ఆటుపోట్లకు లోనైంది. గత శుక్రవారం 5 శాతం లాభంతో రూ.918 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.900 పై శ్రేణిలో ప్రవేశించి రూ.1,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.880 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఇండిగో: గత ఏడాది ఆగస్టు నుంచి పతనమవుతూ వస్తున్న ఈ షేరు కీలకమైన రూ.4,000 మద్దతు స్థాయిలో మరోసారి బౌన్స్‌ బ్యాక్‌ అయ్యాయి. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 20 శాతం పెరిగింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ పెరుగుతున్నాయి. గత శుక్రవారం 4 శాతం లాభంతో రూ.4,709 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మూమెంటమ్‌ ఇన్వెస్టర్లు రూ.4,650 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.4,850/5,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.4,620 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


టైటాన్‌: 2024 నుంచి ఆటుపోట్లకు లోనైన ఈ కౌంటర్‌లో ఆరోగ్యకరమైన కరెక్షన్‌ నమోదైంది. సుదీర్ఘ బేస్‌ను బ్రేకౌట్‌ చేసిన తర్వాత మూమెంటమ్‌ ప్రదర్శిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండిపై ఆంక్షల నేపథ్యంలో ఈ షేరుపై ఆసక్తి పెరిగింది. రెండు నెలల గరిష్ఠ స్థాయి రూ.4,700 నుంచి 12 శాతం పతనమైన ఈ షేరు మళ్లీ 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకున్నాయి. గత శుక్రవారం రూ.4,184 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ. 4,100 శ్రేణిలో ప్రవేశించి రూ.4,400 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.4,050 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

AIADMKకి సినీ నటి గౌతమి రాజీనామా

అన్‌స్టాపబుల్‌గా అమరావతి నిర్మాణం.. మంత్రి లోకేశ్ వీడియో పోస్ట్

Updated Date - Jun 15 , 2026 | 05:36 AM