Share News

5 రోజుల్లో రూ.25 లక్షల కోట్ల లాభం

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:56 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనైన సూచీలు.. ఆఖరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో...

5 రోజుల్లో రూ.25 లక్షల కోట్ల లాభం

సెన్సెక్స్‌ మరో 254 పాయింట్లు అప్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనైన సూచీలు.. ఆఖరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో మోస్తరు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 254.36 పాయింట్లు ఎగబాకి 77,409.98 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82.30 పాయింట్ల వృద్ధితో 24,168 వద్ద క్లోజైంది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీలు 0.43 శాతం వరకు పెరిగాయి. దాంతో బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ మరో రూ.2.48 లక్షల కోట్లు పెరిగి రూ.477.60 లక్షల కోట్లకు (5.07 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. గడిచిన ఐదు సెషన్లలో సెన్సెక్స్‌ 3,577.43 పాయింట్లు (4.84 శాతం), నిఫ్టీ 1,006.4 పాయింట్లు బలపడగా.. మార్కెట్‌ సంపద రూ.25.27 లక్షల కోట్లు పెరిగింది. కాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 10 పైసలు పెరిగి రూ.94.40 వద్ద ముగిసింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడి చమురు బ్యారల్‌ ధర ఒక దశలో 2.33 శాతం తగ్గి 77.70 డాలర్లకు జారుకుంది.

ఎస్‌బీఐ రూ.60,000 కోట్ల సమీకరణ: ఈ ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా రూ.60,000 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనను బోర్డు ఆమోదించిందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం

ఈపీఎఫ్‌ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..

Updated Date - Jun 19 , 2026 | 05:56 AM