ఆటుపోట్లలోనే..!
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:17 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరలు చల్లబడే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. పశ్చిమాసియాలో యుద్ధం సద్దుమణిగేంత...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మరింత ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. క్రూడాయిల్ ధరలు చల్లబడే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. పశ్చిమాసియాలో యుద్ధం సద్దుమణిగేంత వరకు మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్న విలువైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అవలంబించవచ్చు. గత వారం ఆటో, మెటల్, పీఎ్‌సయూ బ్యాంక్, కమోడిటీస్ రంగాలు కొంత బలాన్ని ప్రదర్శించాయి.
స్టాక్ రికమండేషన్స్
జిందాల్ స్టీల్: గత ఏడాది మార్చి నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. 50 శాతానికి పైగా రాబడిని అందించింది. చివరి 15 సెషన్లలో 12 శాతం దిద్దుబాటుకు లోనైనా రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉండటం గమనార్హం. గత శుక్రవారం రూ.1,186 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,180 శ్రేణిలో ప్రవేశించి రూ.1,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.1,150.
లారస్ ల్యాబ్స్: రెండేళ్లుగా ఈ షేరు బుల్ రన్ కొనసాగిస్తోంది. తాజా మార్కెట్ పరిస్థితులతో 17 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ పెరుగుతుండటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.987 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.980 శ్రేణిలో ప్రవేశించి రూ.1,050/1,100 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.950.
గ్లెన్‌మార్క్: గత ఏడాది జూలైలో జీవితకాల గరిష్ఠానికి చేరిన ఈ కౌంటర్‌లో దిద్దుబాటు పూర్తయింది. ఆరు నెలలుగా చక్కని బేస్ ఏర్పడింది. కప్ హ్యాండిల్ ఫార్మేషన్ కనిపిస్తోంది. నిఫ్టీతో పోలిస్తే జోరు ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.2,180 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,160 స్థాయిలో ప్రవేశించి రూ.2,250 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,120 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టు కోవాలి.
సెయిల్: గత ఏడాది జనవరి నుంచి ఈ షేరు 60 శాతానికి పైగా రాబడిని అందించింది. మల్టీ ఇయర్ బ్రేకౌట్‌కు సిద్ధమవుతోంది. రూ.170 వద్ద నిరోధాన్ని అధిగమిస్తే మరింత దూకుడును ప్రదర్శిస్తుంది. గత శుక్రవారం రూ.155 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.155 స్థాయిలో ప్రవేశించి రూ.170 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.152.
కెనరా బ్యాంక్: గత ఏడాది మార్చి నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయిలో కదలాడుతోంది. మూమెంటమ్ లభిస్తే దాన్ని అధిగమించి మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. గరిష్ఠ స్థాయిల్లో అక్యుములేషన్ కొనసాగుతోంది. తాజా పరిస్థితుల్లో 20 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. గత శుక్రవారం రూ.136 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.136 ఎగువన ప్రవేశించి రూ.155 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.136.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప