Share News

ఐటీ షేర్లలో కొనుగోళ్లు

ABN , Publish Date - Aug 29 , 2026 | 02:54 AM

భారత స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతోపాటు...

ఐటీ షేర్లలో కొనుగోళ్లు

  • సెన్సెక్స్‌ 331 పాయింట్లు అప్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతోపాటు ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 330.92 పాయింట్లు ఎగిసి 77,264.51 వద్దకు చేరగా..నిఫ్టీ 84.80 పాయింట్ల వృద్ధితో 24,175.65 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.28 లక్షల కోట్లు పెరిగి రూ.492.82 లక్షల కోట్లకు (5.16 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 02:54 AM