సూచీల మిశ్రమ ముగింపు
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:00 AM
భగ్గుమంటున్న ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 113.61 పాయింట్ల...
సెన్సెక్స్ 114 పాయింట్లు అప్.. నిఫ్టీ 40 పాయింట్లు డౌన్
ముంబై: భగ్గుమంటున్న ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 113.61 పాయింట్ల పెరుగుదలతో 78,079.96 వద్దకు చేరగా.. నిఫ్టీ 40.10 పాయిం ట్లు కోల్పోయి 24,395.85 వద్దకు జారుకుంది. నిఫ్టీ నష్టపోవడం వరుసగా ఇది మూడో రోజు. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 19 లాభపడగా.. ఇండిగో షేరు అత్యధికంగా 2.86 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్ షేర్లు మాత్రం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. కాగా, బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్ సెలెక్ట్, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీలు 0.53 శాతం వరకు పెరిగాయి.
టాటా షేర్లలోనూ మిశ్రమ ట్రెండే..
టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో బుధవారం నష్టాల్లో సాగిన గ్రూప్ షేర్లు.. గురువారం మాత్రం మిశ్రమంగా ముగిశాయి. టాటా టెక్నాలజీస్ 3.26 శాతం, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2.74 శాతం ఎగబాకగా.. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ఎలెక్సీ, టాటా కమ్యూనికేషన్స్, ట్రెంట్ స్టాక్స్ ఒక శాతానికి పైగా పెరిగాయి. టీసీఎస్ 0.99 శాతం లాభపడింది. టైటన్ 1.08 శాతం నష్టపోగా.. టాటా స్టీల్, టాటా కెమికల్స్ కూడా స్వల్పంగా తగ్గాయి.
వెండి రూ.6,000 డౌన్
వరుసగా ఏడు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధర కాస్త దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.2,800 తగ్గుదలతో రూ.1.57 లక్షలకు పరిమితమైంది. కిలో వెండి ఏకంగా రూ.6,000 తగ్గి రూ.2.40 లక్షలకు జారుకుంది.
ముత్తూట్ ఫిన్‌కార్ప్ రూ.3,000 ఐపీఓ
ముత్తూట్ గ్రూప్‌నకు చెందిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్.. తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు(డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.
మిల్కీ మిస్ట్ ఐపీఓకు 56 రెట్ల బిడ్లు
డెయిరీ ఉత్పత్తుల కంపెనీ మిల్కీ మిస్ట్ రూ.1,553 కోట్ల ఐపీఓకు భారీ స్పందన లభించింది. గురువారంతో ముగిసిన ఈ ఇష్యూకు ఏకంగా 56.12 రెట్ల బిడ్లు లభించాయి. ఈనెల 18న కంపెనీ తన షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేసే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..