Share News

మూడో రోజూ ముందుకే..

ABN , Publish Date - Feb 11 , 2026 | 06:04 AM

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. మంగళవారం సెన్సెక్స్‌ 208.17 పాయింట్ల లాభంతో 84,273.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67.85 పాయింట్ల...

మూడో రోజూ ముందుకే..

  • రూ.1.14 లక్షల కోట్లు పెరిగిన సంపద

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. మంగళవారం సెన్సెక్స్‌ 208.17 పాయింట్ల లాభంతో 84,273.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67.85 పాయింట్ల వృద్ధితో 25,935.15 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.14 లక్షల కోట్లు పెరిగి రూ. 474.48 లక్షల కోట్లకు చేరుకుంది.

ఆర్వీ ఇంజనీరింగ్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

భిన్న రంగాలకు సాంకేతికత ఆధారిత కన్సల్టెన్సీ సేవలందించే హైదరాబాద్‌ కంపెనీ ‘ఆర్వీ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ లిమిటెడ్‌’ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.202.5 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతోపాటు ప్రమోటర్‌ వెంకటాచల చక్రపాణి రెడ్ల వాటాకు చెందిన 67.5 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిన విక్రయించనుంది.

రూ.2.64 లక్షలకు జారిన కిలో వెండి ధర: అంతర్జాతీయ మార్కెట్లో టెరండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ వెండి తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతోంది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర.. మంగళవారం రూ.7,500 తగ్గి రూ.2,64,500కు జారుకుంది. 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు మాత్రం రూ.2,200 పెరిగి రూ.1,60,700కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికొస్తే, ఔన్స్‌ (31.10 గ్రాములు) వెండి 1.37 శాతం తగ్గి రూ.82.16 డాలర్లకు జారుకోగా.. గోల్డ్‌ రూ.5,052 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

  • గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లలోకి ఈ జనవరిలో రూ.24,040 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2025 డిసెంబరులో నమోదైన రూ.11,647 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఇది రెట్టింపు పై మాటే.

ఈ వార్తలూ చదవండి:

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్

Updated Date - Feb 11 , 2026 | 06:04 AM