Share News

పరిమిత శ్రేణిలో సూచీల గమనం!

ABN , Publish Date - Aug 24 , 2026 | 06:09 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడాయిల్‌ ధరల సెగతో పరిమిత శ్రేణిలో కన్సాలిడేట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి...

పరిమిత శ్రేణిలో సూచీల గమనం!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడాయిల్‌ ధరల సెగతో పరిమిత శ్రేణిలో కన్సాలిడేట్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 24,000-24,150 మద్దతు స్థాయిలను కాపాడుకుంటూ 24,430 నిరోధం దిశగా పయనించే అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తున్నప్పటికీ దేశీయంగా సంస్థాగత మదుపరులు పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. రక్షణ, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ రంగాలు దూకుడును ప్రదర్శిస్తుండగా రాబోయే పండగల సీజన్‌ డిమాండ్‌తో ఆటోమొబైల్‌, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్‌, ఫార్మా రంగాలు రాణించే వీలుంది. ముడి చమురు భయాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లు చేపట్టడమే మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

జైడస్‌ లైఫ్‌ సైన్సెస్‌: ఈ కౌంటర్‌ మంచి బేస్‌ ఏర్పరచుకున్న తర్వాత పరుగులు పెడుతూ వస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 32 శాతం మేర రాబడిని అందించింది. ఈపీఎస్‌ క్రమంగా మెరుగవుతుండటం, రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతుండటం ఇందుకు కారణాలు. జీవితకాల గరిష్ఠం వైపు వెళుతుండటం సానుకూల అంశం. గత శుక్రవారం రూ.1,120 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,100 శ్రేణిలో ప్రవేశించి రూ.1,270 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,070 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

క్యాప్‌స్టన్‌ సర్వీసెస్‌: ఈ కౌంటర్‌లో బుల్‌ రన్‌ కొనసాగుతూనే ఉంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌కు తిరుగులేదు. ఆర్థిక ఫలితాలు నిలకడగా ఉన్నాయి. గత శుక్రవారం రూ.528 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.520/500 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.650 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.475 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

హిందాల్కో: జీవితకాల గరిష్ఠం తర్వాత 20 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు మళ్లీ 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పుంజుకుంది. ప్రస్తుతం షార్ట్‌టర్మ్‌ మూవింగ్‌ యావరేజెస్‌ పైనే కొనసాగుతోంది. గత శుక్రవారం రూ.1,034 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,020 శ్రేణిలో ప్రవేశించి రూ.1,150 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.990 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ఎల్‌ అండ్‌ టీ: ఈ కౌంటర్‌ అస్థిరంగా చలిస్తోంది. 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద చాలాసార్లు మద్దతు తీసుకుంది. తాజా ఫలితాలు, ఆర్డర్ల నేపథ్యంలో కొంత మూమెంటమ్‌ కనిపించే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.4,093 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో రూ.4,050 ఎగువన ఎంటరై రూ.4,250 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.4,010 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.


అదానీ పోర్ట్స్‌ : గత ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ షేరు 62 శాతం మేర రాబడిని అందించింది. 200 రోజుల మూవింగ్‌ యావరేజీ వద్ద మద్దతు తీసుకున్న ప్రతిసారి పుంజుకుని అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. మళ్లీ అలాంటి అవకాశం కనిపిస్తోంది. తాజా త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం, రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగుండటం సానుకూల అంశాలు. గత శుక్రవారం రూ.1,700 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,680 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,850/1,900 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,650 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..

అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..

Updated Date - Aug 24 , 2026 | 06:09 AM