Share News

ఆచితూచి అడుగేయండి!

ABN , Publish Date - May 04 , 2026 | 02:13 AM

వరుసగా నష్టాలను నమోదు చేస్తూ వస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కొంత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్‌ కాంగ్రె్‌సలో ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టేనని...

ఆచితూచి అడుగేయండి!

వరుసగా నష్టాలను నమోదు చేస్తూ వస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కొంత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్‌ కాంగ్రె్‌సలో ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టేనని అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పటం, కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. అలాగే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు కొనుగోళ్ల బాట పట్టడం కూడా కలిసిరానుంది. అయితే మార్కెట్లలో ఇంకా అనిశ్చితి తొలగి పోలేదు. కాబట్టి ఆచితూచి వ్యవహరించటం మంచిది. ప్రస్తుతం రియల్టీ, ఎనర్జీ, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, కమోడిటీస్‌ రంగాలు మూమెంటమ్‌ను ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

కేపీఐటీ టెక్నాలజీస్‌: రెండేళ్ల క్రితం జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు అప్పటి నుంచి డౌన్‌ట్రెండ్‌లోనే కొనసాగుతోంది. దాదాపు 70 శాతం మేర దిద్దుబాటుకు లోనయ్యాయి. అయితే కీలకమైన రూ.620 స్థాయిలో మద్దతు తీసుకున్న ఈ కౌంటర్‌ రెండు నెలల్లో 20 శాతం మేర రాబడిని అందించింది. ఈ వారం ఆర్థిక ఫలితాలు వెలువడనుండటంతో ఆసక్తి పెరిగింది. గత గురువారం రూ.759 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.750 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.930 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.720 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బెర్జర్‌ పెయింట్స్‌: రెండేళ్లుగా ఈ షేరు రూ.400 నుంచి రూ.600 శ్రేణిలో కదలాడుతోంది. విపరీతమైన స్వింగ్స్‌ నమోదవుతున్నాయి. త్వరలో ఆర్థిక ఫలితాలు విడుదలవుతుండటం, రూ.380 స్థాయిలో టర్న్‌ అరౌండ్‌ కావటంతో ఈ కౌంటర్‌పై ఆసక్తి పెరిగింది. గత గురువారం రూ.473 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.460 ఎగువన ఎంటరై రూ.580 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.430 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఎస్‌బీఐ లైఫ్‌: ఏడాది కాలంలో 50 శాతం రాబడిని అందించిన ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత పతనమవుతూ వస్తోంది. దాదాపు 17 శాతం దిద్దుబాటుకు లోనయ్యాయి. అయితే రూ.1,740 స్థాయిలో రెండోసారి మద్దతు లభించింది. గత గురువారం రూ.1,819 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,800 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,010 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,770 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మోతీలాల్‌ ఓస్వాల్‌: గత ఏడాది నవంబరులో రూ.1,080 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు 44 శాతం మేర పతనమైంది. అయితే మార్చిలో రూ.617 వద్ద మద్దతు తీసుకుని 30 శాతం మేర పుంజుకుంది. పైగా 200 రోజుల సగటును దాటే అవకాశం కనిపిస్తోంది. గత గురువారం రూ.800 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.790 వద్ద ప్రవేశించి రూ.970 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.770 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

లారస్‌ ల్యాబ్స్‌: రెండేళ్లుగా ఈ షేరు బుల్‌రన్‌ను కొనసాగిస్తోంది. తాజా మార్కెట్‌ పరిస్థితుల్లో 17 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. పైగా డబుల్‌ బాటమ్‌ ఫామ్‌ అవ్వటం, రిలేటివ్‌ స్ట్రెంత్‌, వాల్యూమ్‌ పెరుగుతుండటం సానుకూల అంశాలు. గత గురువారం రూ.1,100 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,100 శ్రేణిలో ఎంటరై రూ.1,280 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,070 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

ఈ వార్తలు కూడా చదవండి

బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - May 04 , 2026 | 02:13 AM