అంతర్జాతీయ పరిణామాలే కీలకం!
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:25 AM
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ల గమనం.. అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం నేపథ్యంలో గత వారం వరుసగా నాలుగు సెషన్లు...
ఈ వారం భారత స్టాక్ మార్కెట్ల గమనం.. అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం నేపథ్యంలో గత వారం వరుసగా నాలుగు సెషన్లు లాభాల్లో సాగాయి. తాజాగా ఇరాన్ అన్ని షరతులకు ఒప్పుకోలేదని ట్రంప్ ప్రకటించటం, ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగటంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మదుపరులు వేచి చూసే ధోరణిని అనుసరించటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
భారత్ డైనమిక్స్ లిమిటెడ్: గత ఏడాది మే నెలలో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్న ఈ షేరు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 50 శాతం మేర పతనమైంది. అప్పటి నుంచి టర్న్ అరౌండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. బైయింగ్ మూమెంటమ్ కనిపిస్తోంది. చివరి ఆరు సెషన్లలో 18 శాతం పెరిగి 200 రోజుల మూవింగ్ యావరేజీకి చేరుకోవటం గమనార్హం. గత శుక్రవారం రూ.1,373 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,350 ఎగువన ప్రవేశించి రూ.1,500 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,3,20 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
నేషనల్ అల్యూమినియం: ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవితకాల గరిష్ఠానికి చేరిన తర్వాత ఈ షేరు సైడ్‌వే్‌సలో చలిస్తోంది. ప్రస్తుతం రూ.376 వద్ద మద్దతు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒడుదొడుకులు లేకపోవటంతో ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. రిలేటివ్ స్ట్రెంత్ మెరుగ్గా ఉంది. గత శుక్రవారం రూ.376 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.370 ఎగువన ఎంటరై రూ.470/500 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.360 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎటర్నల్: గత అక్టోబరులో జీవితకాల గరిష్ఠాన్ని చేరిన తర్వాత ఈ కౌంటర్‌లో 42 శాతం వరకు దిద్దుబాటు జరిగింది. రూ.214 వద్ద మద్దతు తీసుకుని దాదాపు 23 శాతం పెరిగింది. 200 రోజుల మూవింగ్ యావరేజీని బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత శుక్రవారం రూ.264 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.260 శ్రేణిలో ప్రవేశించి రూ.310 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.250 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
గ్లెన్‌మార్క్: ఈ కౌంటర్‌లో గరిష్ఠ స్థాయిల్లో మంచి బేస్ ఏర్పడింది. 22 శాతం కరెక్షన్ అయిన తర్వాత చక్కని మూమెంటమ్ ప్రదర్శించాయి. పైగా 200 రోజుల మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకుని పుంజుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం వచ్చింది. గత శుక్రవారం రూ.2,213 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.2,160 శ్రేణిలో ప్రవేశించి రూ.2,450 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,100 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
భారతి ఎయిర్‌టెల్: కొన్నాళ్లుగా సైడ్‌వే్‌సలో చలిస్తున్న ఈ షేరు మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. చివరి ఏడు సెషన్లలోనే దాదాపు 8 శాతం మేర పెరిగింది. 200 రోజుల మూవింగ్ యావరేజీని బ్రేక్ చేసింది. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. గత శుక్రవారం రూ.1,910 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,900 శ్రేణిలో ఎంటరై రూ.2,050 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,860 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..