Share News

ఆటుపోట్లలోనే..!

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:11 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం భీకరంగా కొనసాగుతుండటంతో పాటు అమెరికా జాబ్‌ డేటా, ద్రవ్యోల్బణం విపరీతంగా ఉండటం....

ఆటుపోట్లలోనే..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం భీకరంగా కొనసాగుతుండటంతో పాటు అమెరికా జాబ్‌ డేటా, ద్రవ్యోల్బణం విపరీతంగా ఉండటం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సూచీల గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు లాభా ల స్వీకరణకు మొగ్గు చూపొచ్చు. నష్టభయాన్ని అంచనా వేసుకుని ఎంపిక చేసిన షేర్లలోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రస్తుతం పీఎ్‌సయూ బ్యాంక్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎనర్జీ, హెల్త్‌కేర్‌, ఫార్మా షేర్లు కొంత బలాన్ని ప్రదర్శిస్తున్నాయి.

స్టాక్‌ రికమండేషన్స్‌

వోల్టాస్‌: జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి 49 శాతం మేర పతనమైన ఈ షేరు ప్రస్తుతం కన్సాలిడేషన్‌ దశను ముగించుకుంది. ఏడాదికాలంగా మంచి బేస్‌ ఏర్పడింది. రూ.1,500 వద్ద బలమైన నిరోధాన్ని బ్రేక్‌ చేసింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1,561 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,550 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,620 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,520 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఐడీబీఐ బ్యాంక్‌: గత ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. చిన్నచిన్న కరెక్షన్‌ వచ్చినా బుల్లిష్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. 2025 నుంచి ఇప్పటి వరకు 75 శాతం మేర రాబడిని అందించింది. గత శుక్రవారం రూ.116 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.114 స్థాయిలో ప్రవేశించి రూ.125 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.110 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌: ఈ షేరు దీర్ఘకాలంగా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. గత ఏడాది మార్చి నుంచి 70 శాతం మేర రాణించింది. మెరుగైన రిలేటివ్‌ స్ట్రెంత్‌తో జీవితకాల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసేందుకు సిద్ధంగా ఉంది. గత శుక్రవారం రూ.187 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.185 శ్రేణిలో ఎంటరై రూ.210 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.180 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ట్యూబ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌: ప్రస్తుతం ఈ షేరు మీడియం టర్మ్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉంది. జీవితకాల గరిష్ఠం నుంచి 55 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఇప్పుడిప్పుడే మెరుగవుతోంది. చివరి 20 సెషన్లలో 30 శాతం పెరగటం గమనార్హం. గత శుక్రవారం రూ.2,753 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,700 శ్రేణిలో ప్రవేశించి రూ.2,950 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,660 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


ఆయిల్‌ ఇండియా: జీవితకాల గరిష్ఠం నుంచి 56 శాతం మేర పతనమైన ఈ కౌంటర్‌ ప్రస్తుతం మీడియం అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. చక్కని బేస్‌ ఏర్పరచుకుంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.483 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.480 శ్రేణిలో ప్రవేశించి రూ.540 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.460 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 02 , 2026 | 02:11 AM