మార్కెట్ ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:09 AM
స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. ఈక్విటీ సూచీలు బుధవారం భారీగా నష్టపోయాయి. ఒకదశలో...
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. ఈక్విటీ సూచీలు బుధవారం భారీగా నష్టపోయాయి. ఒకదశలో 831 పాయింట్ల వరకు పతనమైన సెన్సెక్స్.. చివరికి 756.84 పాయింట్ల నష్టంతో 78,516.49 వద్దకు జారుకుంది. నిఫ్టీ 198.50 పాయింట్లు కోల్పోయి 24,378.10 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి, హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా స్తంభించిపోవడంతో ముడిచమురు ధర ఒకదశలో 100 డాలర్లకు ఎగబాకడంతోపాటు ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు అధికమవడం ఇందుకు కారణం.
భారత కరెన్సీ మళ్లీ బలహీనపడుతోంది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 34 పైసలు క్షీణించి రూ.93.78కు చేరుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
యాపిల్ కొత్త సారథి జాన్ టర్నెస్
హెచ్‌సీఎల్ టెక్ లాభం రూ.4,488 కోట్లు