మార్కెట్‌కు మళ్లీ చమురు సెగ
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:05 AM
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాలుస్తుండటంతో ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 77000...
77,000 దిగువకు సెన్సెక్స్
రూ.5.14 లక్షల కోట్ల సంపద నష్టం
ముంబై: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాలుస్తుండటంతో ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. దాంతో భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్ 77000, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 24000 స్థాయిలను చేజార్చుకున్నాయి. సెన్సెక్స్ బుధవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 1,446.72 పాయింట్లు క్షీణించి 76,759.26 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ చివరికి 1,342.27 పాయింట్ల నష్టంతో 76,863.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 394.75 పాయింట్లు పతనమై 23,866.85 వద్దకు జారుకుంది. అమ్మకాల హోరులో రూ.5.14 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైపోయింది. దాంతో బీఎ్‌సఈ లిస్టె డ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.441.90 లక్షల కోట్లకు (4.81 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి క్షీణత మార్కెట్‌పై మరింత ఒత్తిడి పెంచాయని విశ్లేషకులన్నారు.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 1.55%, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.61% జారుకున్నాయి.
ఎల్‌పీజీ కొరత నేపథ్యంలో దేశంలో ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. దాంతో బీఎ్‌సఈలో బటర్‌ఫ్లై గాంధిమతి అప్లయెన్సెస్ షేరు 14.69ు, స్టోవ్ క్రాఫ్ట్ 11.74%, టీటీకే ప్రెస్టీజ్ 10.37%, జైపాన్ ఇండస్ట్రీస్ 4% పెరిగాయి.
నెలలో ఎఫ్‌పీఐ అమ్మకాలు రూ.40,000 కోట్లు: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ) బుధవారం రూ.6,267.31 కోట్ల విక్రయాలు జరిపారు. దీంతో ఈనెలలో ఇప్పటి వరకు ఎఫ్‌ఐఐల అమ్మకాలు రూ.39,417 కోట్లకు చేరుకున్నాయి.
రూపాయీ జారింది..: ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసల నష్టంతో రూ.92.01 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర ఒకదశలో 92 డాలర్ల ఎగువకు పెరగడంతోపాటు డాలర్ బలోపేతం కావడం ఇందుకు కారణం.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..