Share News

మార్కెట్లో అమ్మకాల హోరు

ABN , Publish Date - May 30 , 2026 | 02:30 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్‌ చివర్లో లాభాల స్వీకరణ అమ్మకాల హోరుతో...

మార్కెట్లో అమ్మకాల హోరు

సెన్సెక్స్‌ 1,092 పాయింట్లు డౌన్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసాయి. ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్‌ చివర్లో లాభాల స్వీకరణ అమ్మకాల హోరుతో ‘బేర్‌’మన్నాయి. దీంతో సెన్సెక్స్‌ 1,092.06 పాయింట్ల నష్టంతో 74,775.74 దగ్గర క్లోజవగా నిఫ్టీ 359.40 పాయింట్లు నష్టపోయి 24,547.75 వద్ద క్లోజైంది. ఫలితంగా బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌ శుక్రవారం ఒక్క రోజే రూ.5.77 లక్షల కోట్లు నష్టపోయి రూ.464.97 లక్షల కోట్లకు చేరింది.

తగ్గిన విదేశీ మారక నిల్వలు: ఈ నెల 22తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్‌) నిల్వలు మరింత తగ్గాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే 751.10 కోట్ల డాలర్లు (రూ.71,354.5 కోట్లు) తగ్గి 68,138.4 కోట్ల డాలర్లకు చేరినట్టు ఆర్‌బీఐ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ

తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Updated Date - May 30 , 2026 | 02:30 AM