Share News

మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ

ABN , Publish Date - May 29 , 2026 | 12:23 PM

ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ తాజాగా 65 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ విలువ 965 బిలియన్ డాలర్లుగా తేలింది.

మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
Anthropic Valuation Nears Trillion Dollar Mark

ఇంటర్నెట్ డెస్క్: టెక్ రంగంలో భవిష్యత్తు ఇక ఏఐ సంస్థలదే అని ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నారు. ఫలితంగా ఏఐ స్టార్టప్‌ల మార్కెట్ విలువ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ నిధుల సమీకరణ చేపట్టింది. మొత్తం 65 బిలియన్ డాలర్ల నిధులను సేకరించగలిగింది. ఈ క్రమంలో ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ ఏకంగా 965 బిలియన్ డాలర్లుగా తేలింది. ఆల్టిమీటర్ క్యాపిటల్, డ్రాగోనీర్, గ్రీనోక్స్, సెక్వోయా క్యాపిటల్ వంటి సంస్థలు ఆంథ్రోపిక్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఒక్కో సంస్థ రెండు బిలియన్ డాలర్ల మేర ఆంథ్రోపిక్‌లో ఇన్వెస్ట్ చేశాయి.


టెక్ దిగ్గజాలు అనేకం ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటిపోయాయి. ఎన్విడియా, ఆల్ఫబెట్, యాపిల్ సంస్థల మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లకు పైనే ఉంది. ఇక మైక్రోసాఫ్ట్ (3.1 ట్రిలియన్ డాలర్లు), అమెజాన్ (2.8 ట్రిలియన్ డాలర్లు)‌ కూడా దూసుకెళుతున్నాయి. ఏఐకి మారుపేరుగా మారిన చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ కూడా ఐపీఓకు సిద్ధమవుతోంది. 800 బిలియన్‌ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్ల మధ్య మార్కెట్ విలువ‌ను చేరుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఆంథ్రోపిక్ ఇప్పటికే 900 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఇదే ఒరవడి కొనసాగితే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను చేరుకున్న తొలి ఏఐ స్టార్టప్‌గా ఆంథ్రోపిక్ అవతరించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు

రూపాయి పతనాన్ని ఆపొద్దు.. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సూచన

Updated Date - May 29 , 2026 | 12:47 PM