వరుస నష్టాల నుంచి ఊరట
ABN , Publish Date - Aug 21 , 2026 | 06:02 AM
వరుసగా ఏడు రోజులు నష్టపోయిన నిఫ్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. గురువారం ట్రేడింగ్‌లో సూచీ 153.55 పాయింట్లు ఎగబాకి 24,231.85 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ సైతం నాలుగు రోజుల ...
సెన్సెక్స్ 628 పాయింట్లు అప్
ముంబై: వరుసగా ఏడు రోజులు నష్టపోయిన నిఫ్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. గురువారం ట్రేడింగ్‌లో సూచీ 153.55 పాయింట్లు ఎగబాకి 24,231.85 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్ సైతం నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరదించి, 628.04 పాయింట్ల వృద్ధితో 77,537.72 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బాండ్ల రేట్లు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్లతోపాటు దేశీయ ఈక్విటీ సూచీలూ ర్యాలీ తీయడం ఇందుకు దోహదపడింది.
సొంత ప్లాట్‌ఫామ్‌లోనూ ఎన్‌ఎ్‌సఈ షేర్ల ట్రేడింగ్
తొలి పబ్లిక్ ఆఫరింగ్ తర్వాత నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్(ఎన్‌ఎ్‌సఈ) తన షేర్లను బీఎ్‌సఈలో నమోదు చేశాక సొంత ప్లాట్‌ఫామ్‌లోనూ ట్రేడింగ్‌కు అనుమతించే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఎన్‌ఎ్‌సఈ.. సెబీ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ‘పర్మిటెడ్-టు-ట్రేడ్’ మార్గాన్ని ఎంచుకోవచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రస్తుత సెబీ నిబంధనల ప్రకారం. స్టాక్ ఎక్ఛేంజ్‌లు తమ షేర్లను సొంత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయడానికి వీల్లేదు.
ఇవి కూడా చదవండి..
నీట్ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం..
పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్.