లాభాల్లోకి మార్కెట్లు
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:40 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, టెలికాం షేర్లలో కొనుగోళ్లు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న ర్యాలీతో...
సెన్సెక్స్ 610 పాయింట్లు అప్
24,100 పాయింట్ల ఎగువకు నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, టెలికాం షేర్లలో కొనుగోళ్లు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న ర్యాలీతో బీఎస్ఈ సెన్సెక్స్ 610 పాయిం ట్లు లాభపడి 77,496.36 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒక దశలో 1,095.6 పాయింట్లు పెరిగి 77,982.51 స్థాయిని తాకింది. మరోవైపు ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 181.95 పాయింట్ల లాభంతో 24,177.65 వద్ద క్లోజైంది.

ద్వితీయార్ధానికి జియో ఐపీవో వాయిదా!: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ర్టీస్ తన జియో ప్లాట్‌ఫామ్స్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలనే ప్రణాళిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి వాయిదా పడే అవకాశం ఉందని క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. జియో ఐపీవో మే నెలలో రావొచ్చని ఇంతకు ముందు మార్కెట్లో వార్తలు వచ్చాయి. రిలయన్స్.. జియోలోని తన 67 శాతం వాటా నుంచి 2.5-3 శాతం విక్రయించాలని భావిస్తోంది. అయితే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఐపీవో ద్వితీయార్ధానికి వాయిదా పడవచ్చని భావిస్తున్నట్టు క్రెడిట్‌సైట్స్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..