కొనుగోళ్ల జోష్!
ABN , Publish Date - Jul 30 , 2026 | 03:32 AM
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ షేర్ల కొనుగోళ్లు జోరుగా జరగడంతో బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్ 888.68 పాయింట్లు (1.16 శాతం) పెరిగి 77,654.60 వద్ద ముగిసింది...
సెన్సెక్స్ 889 పాయింట్లు పెరుగుదల
మళ్లీ 24,000 ఎగువ స్థాయికి నిఫ్టీ
రూ.4.19 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, లార్సన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ షేర్ల కొనుగోళ్లు జోరుగా జరగడంతో బుధవారం బీఎ్‌సఈ సెన్సెక్స్ 888.68 పాయింట్లు (1.16 శాతం) పెరిగి 77,654.60 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 264.85 పాయింట్లు (1.10 శాతం) ఎగబాకి 24,250.20 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 999.57 పాయింట్లు పెరిగి 77,765.49 స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్ షేర్లలోని హిందుస్థాన్ యూనిలీవర్ అత్యధికంగా 4.70 శాతం, ఇన్ఫోసిస్ 4.50 శాతం, లార్సన్ అండ్ టుబ్రో 2.55 శాతం మేర పెరిగాయి. ట్రెంట్, టాటా స్టీల్, భారతీఎయిర్‌టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. ఇక అదానీ పోర్ట్స్ షేరు అత్యధికంగా 3.19 శాతం నష్టపోయింది. ఎస్‌ఎంఎల్ మహీంద్రా 1.51 శాతం నష్టాన్ని చవిచూసింది. కాగా, ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4.19 లక్షల కోట్ల వృద్ధితో రూ.483.35 లక్షల కోట్లకు చేరింది. కాగా ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ మీనాక్షి ఇండియా.. బీఎస్‌ఈ మెయిన్ బోర్డులో తన షేర్లను లిస్ట్ చేసింది. రూ.281.99 వద్ద షేరు లిస్టయింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పెరిగి రూ.95.76కు చేరుకుంది. దీంతో రూపాయి వరుసగా నాలుగో రోజూ బలపడింది.
ఆర్డీ ఇండస్ర్టీస్ ఐపీఓ ధర శ్రేణి రూ.50-53
ఆర్డీ ఇండస్ర్టీస్ రూ.426 కోట్ల ఐపీఓ ఆగస్టు 5న ప్రారంభమై 7న ముగియనుంది. ఒక్కో షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.50-53గా నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!
విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా