Share News

తగ్గిన చమురు ధర... మురిసిన మార్కెట్లు

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:48 AM

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చల్లబడటంతో పాటు అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల్లో దౌత్యపరమైన పురోగతిపై ఆశల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో సాగాయి...

తగ్గిన చమురు ధర... మురిసిన మార్కెట్లు

291 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చల్లబడటంతో పాటు అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల్లో దౌత్యపరమైన పురోగతిపై ఆశల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో సాగాయి. దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ సూచీ 291.17 పాయింట్లు పెరిగి 77,094.07 వద్ద ముగిసింది. 89.80 పాయింట్ల లాభంతో 24,102.90 వద్ద క్లోజైంది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌, ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లో సాగాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ వంటి బ్లూచిప్‌ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ల రికవరీకి దన్నుగా నిలిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్‌ షేర్లలో టెక్‌ మహీంద్రా అత్యధికంగా 1.87 శాతం పెరిగింది. సన్‌ఫార్మా 1.39 శాతం, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ 1.31 శాతం, ఇన్ఫోసిస్‌ 1.29 శాతం మేర లాభపడ్డాయి.

  • అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక దశలో 1.66 శాతం తగ్గి 79.23 డాలర్లకు చేరుకుంది.

  • రూపాయి మరింత బలహీనపడింది. సోమవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 30 పైసలు తగ్గి రూ.94.63 వద్దకు చేరుకుంది.

  • బంగారం, వెండి ధరలు ఢిల్లీ మార్కెట్లో సోమవారం పెరిగాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,700 పెరిగి రూ.1,52,300 వద్దకు చేరింది. కిలో వెండి ధర రూ.4,800 ఎగబాకి రూ.2,45,500కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాలకు డిమాండ్‌ పెరగడం, రూపాయి క్షీణత వల్ల దేశీయంగా ధరలు పెరిగినట్టు ట్రేడర్లు చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బంగారం దిగుమతులు 70 శాతం డౌన్‌

బంగారం, వెండి భారీగా తగ్గాయ్‌

Updated Date - Jun 23 , 2026 | 05:48 AM