Share News

రెండో రోజు లాభాల్లోనే

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:33 AM

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పెరిగి దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్‌,..

రెండో రోజు లాభాల్లోనే

  • సెన్సెక్స్‌ 109 పాయింట్లు అప్‌

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పెరిగి దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా రెండో రోజూ లాభాలను నమోదు చేశాయి. గురువారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 109.25 పాయింట్లు పెరిగి 77,100.47 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 34.35 పాయింట్ల లాభంతో 24,056 వద్ద క్లోజైంది. ఆటో, ఏవియేషన్‌, బ్యాంకింగ్‌ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో 19 షేర్లు నష్టపోగా 11 షేర్లు పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 811.96 పాయింట్లు పెరిగి డే గరిష్ఠ స్థాయి 77803.18ని తాకింది. అయితే ఐటీ, మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా ద్వితీయార్ధంలో లాభాలు తగ్గిపోయాయి.

నేడు మార్కెట్లు పని చేయవు: మొహర్రం సందర్భంగా శుక్రవారం స్టాక్‌, మనీ, కమోడిటీస్‌ మార్కెట్లు పని చే యవు.

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 05:33 AM