Share News

నష్టాల నుంచి లాభాల్లోకి..

ABN , Publish Date - May 21 , 2026 | 02:01 AM

దేశీయ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ బుధవారం నాటి ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు లాభాలతో ముగిసింది...

నష్టాల నుంచి లాభాల్లోకి..

117 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: దేశీయ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ బుధవారం నాటి ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు లాభాలతో ముగిసింది. 117.54 పాయింట్ల లాభంతో 75318.39 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ షేర్లలో ర్యాలీ ఇందుకు దోహదపడింది. నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 23659 పాయింట్ల వద్ద ముగిసింది.

సరికొత్త జీవనకాల కనిష్ఠానికి రూపాయి

రూపాయి విలువ మరింత క్షీణించింది. బుధవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరో 16 పైసలు తగ్గి సరికొత్త జీవనకాల కనిష్ఠం రూ.96.86కు చేరుకుంది. పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ముడిచమురు ధరలతో ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఆందోళనలు పెరగడంతో రూపాయిపై ప్రభావం పడుతోంది.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ.

Updated Date - May 21 , 2026 | 02:02 AM